Home Uncategorized ఏటూరునాగారంలో ప్రగతి పాలన ప్రారంభం

ఏటూరునాగారంలో ప్రగతి పాలన ప్రారంభం

13
0
  • 99 రోజుల ప్రత్యేక కార్యచరణను ఆవిష్కరించిన సర్పంచ్ కాకులమర్రి శ్రీలత.

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మార్చి 6:

స్థానిక ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత ఉపసర్పంచ్ పంచాయతీ కార్యదర్శి సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. రాబోయే 99 రోజుల పాటు నిరంతరాయంగా సాగే ఈ ప్రత్యేక ప్రణాళిక ద్వారా మన ఏటూరునాగారాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమని వారు ప్రకటించారు.కాకులమర్రి శ్రీలత సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యంగా ముంచుకొస్తున్న ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజలకు మంచినీటి ఇబ్బంది కలగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.వేసవి మంచినీటి సరఫరా ఎండాకాలంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందేలా చూడటం పైపులైన్ల మరమ్మతులు బోర్ల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించడం.లైబ్రరీ స్కూళ్ల అభివృద్ధి విద్యార్థుల జ్ఞాన వికాసం కోసం గ్రంథాలయాన్ని ఆధునీకరించడం పాఠశాలల్లో మౌలిక వసతులు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం.ప్రజా సమస్యల పరిష్కారం పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యాలయ సేవలను మరింత వేగవంతం చేయడం.పారిశుధ్య నిర్వహణ ఉపసర్పంచ్ పర్యవేక్షణలో డ్రైనేజీల పూడికతీత వీధుల శుభ్రత పచ్చదనాన్ని పెంపొందించడం.సర్పంచ్ కాకులమర్రి శ్రీలత ప్రత్యేక విన్నపం ప్రజలారా మీకేవైనా గ్రామ సమస్యలు ఉన్నా పూర్తి కాని పనులు ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము. మీ సమస్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీని సంప్రదించి మాతో కాంటాక్ట్‌లో ఉండి మీ పనులను పూర్తి చేయించుకోగలరు. మీ సహకారంతోనే మన ఏటూరునాగారం అభివృద్ధి సాధ్యం.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వార్డు సభ్యులు పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలిపారు.