Home Uncategorized మహిళల ఆర్థికాభివృద్ధికి సహకారం అవసరం

మహిళల ఆర్థికాభివృద్ధికి సహకారం అవసరం

21
0
  • ఉల్లెంగుల ఏకానందం మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 20:

మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బీఆర్‌ఎస్ నాయకుడు ఉల్లెంగుల ఏకానందం అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, వచ్చునూర్ గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలకు ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్నీచర్‌ను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఏకానందం మాట్లాడుతూ, ఇప్పటికే తమ ట్రస్ట్ ద్వారా మండలంలోని పలు గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రానున్న జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని మహిళలను కోరారు.
కార్యక్రమం అనంతరం మహిళా సంఘ సభ్యులు ఉల్లెంగుల ఏకానందంకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిందం విజయలక్ష్మి చంద్రమౌళి, గ్రామ శాఖ అధ్యక్షుడు తాటిపల్లి చంద్రమౌళి, హర్షవర్దన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సుద్దాల రాజేష్, యాదగిరి, వీవోఏ న్యాలం రజిత, గొల్లపల్లి సుజాత, కమటం రమాదేవి, వీవో ఓబీలు, బండారి కుమారస్వామి, తిరుపతి, తాజోద్దిన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.