Home తెలంగాణ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఎల్‌బీనగర్‌లో భారీ నిరసన

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఎల్‌బీనగర్‌లో భారీ నిరసన

13
0
  • కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, ఆర్గాన్ న్యూస్ :

పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం పెంచుతూ ప్రజలపై అదనపు భారం మోపుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్ చౌరస్తాలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య ప్రజల జీవనం తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు అధికమై నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను అదుపు లేకుండా పెంచుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజల తరఫున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో కూడా ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇంధన ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, ఉద్యమకారులు, యువ నాయకులు, మహిళా నాయకులు, వివిధ విభాగాల అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.