Home తెలంగాణ బడ్జెట్ లో బీసీలకు మొండిచేయి

బడ్జెట్ లో బీసీలకు మొండిచేయి

15
0
  • వనపర్తి జిల్లాలో టీఆర్‌పీ నిరసన

వనపర్తి ,ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి, మార్చ్ 23:

వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. బడ్జెట్‌లో బీసీలకు జరిగిన అన్యాయంపై వనపర్తి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీ ఆర్ పి ) భారీ నిరసన చేపట్టింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏటా రూ. 20,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం కేవలం రూ. 12,000 కోట్లే కేటాయించడం బీసీలను వంచించడమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు దండే విజయ్ యాదవ్ విమర్శించారు. 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 6 శాతం నిధులే ఇవ్వడం సామాజిక న్యాయానికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని జిల్లా అధ్యక్షులు దండే విజయ్ యాదవ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండే విజయ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి స్వామి, జిల్లా నాయకులు బాలరాజ్ సాగర్, చిర్ల కృష్ణసాగర్, సత్యం సాగర్, నాయకులు శివ, తాడిపర్తి అరుణ్ కుమార్, తాడిపర్తి దేవేందర్, తాడిపర్తి ఏడి మాలిక్, ఏదుల భాను, అప్పరాల విష్ణుసాగర్, అప్పరాల మహేష్, గోపాల్ పెట్ మండల అధ్యక్షులు దండు రాములు, తదితరులు హెచ్చరించారు.