Home Uncategorized నూతన ఏడాదిని స్వాగతిస్తూ

నూతన ఏడాదిని స్వాగతిస్తూ

69
0
  • అనాధలకు అండగా నిలిచిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
  • అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో రగ్గుల పంపిణీ
  • ఎంపీ తరఫున అనాధలకు అందజేసిన సీనియర్ న్యాయవాది స్వామి రమేష్

ఖమ్మం|ఆర్గాన్:

నూతన సంవత్సరం – 2026 ఆగమనాన్ని ఆహ్వానిస్తూ.. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి బుధవారం పలువురు అనాధలకు, మతిస్థిమితం లేని వారికి ఈ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని.. రగ్గులు వితరణ చేసి తన సేవా తత్పరతను చాటుకున్నారు. ఈ మేరకు నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి రగ్గులు, కంబళ్లు పంపించారు. వీటిని సీనియర్ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా.. అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు స్పందిస్తూ..అనాధల దీనస్థితిని చూసి చలించి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి.. రగ్గులు అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.