అశ్వారావుపేట, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 5:
అశ్వారావుపేట మండలం కేంద్రంలోని వ్యవసాయ కళాశాలలో ప్రపంచ మృతిక దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అసోసియేట్ డీన్ డా. జె. హేమంత్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఓఎస్ఎ డా. ఎం. రాంప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డి. స్రవంతి, డా. ఝాన్సీ రాణి సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డా. హేమంత్‌కుమార్ మాట్లాడుతూ భూసార పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భూసారాన్ని కాపాడినప్పుడే దీర్ఘకాలం పాటు సుస్థిరమైన దిగుబడులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. నేల–నీటి వంటి సహజ వనరుల సంరక్షణతోనే భవిష్యత్ తరాలకు సుభిక్ష జీవనం అందించగలమని వివరించారు.
తరువాత శాస్త్రవేత్త డా. ఎం. రాంప్రసాద్ రైతులు పాటించాల్సిన భూసార పరిరక్షణ పద్ధతులను వివరిస్తూ అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు డా. కే. నాగాంజలి, ఆర్. శ్రీనివాస్‌రావు నేలకోత నివారణ మరియు సమస్యాత్మక భూముల యాజమాన్యంపై సూచనలు అందించారు.
కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డా. శ్రవణ్, డా. శ్రీజన్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.


