Home తెలంగాణ థర్డ్ పార్టీ కార్మిక విధానం రద్దుచేయాలి

థర్డ్ పార్టీ కార్మిక విధానం రద్దుచేయాలి

63
0
  • థర్డ్ పార్టీ ( బెడ్ సైడ్ కాంట్రాక్టు ) విధానం రద్దుచేసి కార్మికులను, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి
  • తెలంగాణ వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు వినతి పత్రం

ఖమ్మం/హైదరాబాద్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 21:

శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ మరియు సూపర్వైజర్ మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు శనివారం హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ నందు తెలంగాణ వైద్యశాఖ మంత్రి డా.దామోదర్ రాజనర్సింహను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు . తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలందు ప్రభుత్వ ఆసుపత్రిలో థర్డ్ పార్టీ ( బెడ్ సైడ్ కాంటాక్ట్ ) విధానంలో పనిచేస్తున్న….. శానిటేషన్ , పేషంట్ కేర్ , సెక్యూరిటీ , సూపర్వైజర్ మొత్తం 17,000 వేల మంది కార్మికులు పై భాగంలో ఉండి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని వారి కుటుంబాలు గడవడం అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని వివరించారు. థర్డ్ పార్టీ ( బెడ్ సైడ్ కాంట్రాక్టు ) విధానం రద్దుచేసి కార్మికులను కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి కుర్రి సైదయ్య , చిన్న బోస్క నరేష్ లు కోరారు . తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్న నిర్ణయం అవుట్ సోర్సింగ్ & కాంటాక్ట్ బేస్ ఎంప్లాయిస్ ని ఇంటిగ్రేడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా ప్రభుత్వమే వారి ఎకౌంటు లోకి వేతనం వేసే విధంగా ప్రణాళిక చేస్తుంది . అలాగే తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న శానిటేషన్ , పేషెంట్ కేర్ , సెక్యూరిటీ గార్డ్ , సూపర్వైజర్ మేము ప్రభుత్వానికి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పేద ప్రజలకు నిరంతరం సర్వీసు అందిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము . యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రభుత్వ ఆస్పటల్ నందు సేవలు అందించాము . ఆనాడు అనేకమంది నేతలు నాయకులు మీ సేవలు ఎంతో విలువ అయినవి అని కొనియాడారు తప్ప మమ్మల్ని మరల పట్టించుకున్న నాధులే లేరు . నిరంతరం వేలాది మంది పేషెంట్ మధ్యలో నిరంతరం విధి నిర్వహణ చేస్తూ ఎంతోమంది మా కార్మికుల కూడా రోగంతో మూలన పడ్డ కార్మికుల కుటుంబాలు ఉన్నాయి అని తెలియజేశారు . మా యందు దయవుంచి ఈ యొక్క థర్డ్ పార్టీ ( బెడ్ సైడ్ కాంటాక్ట్ ) టెండర్ ప్రక్రియను రద్దుచేసి ప్రభుత్వం ఇంటిగ్రేడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారానే మా కార్మికులకు కనీస వేతనం 26,000/- రూపాయలు ఇవ్వాలని కోరారు . ఇప్పటివరకు గత 15 – 20 సంవత్సరం నుండి ప్రభుత్వ ఆస్పటల్ నందు ఇంటిగ్రేడ్ హెల్త్ ఫైనాన్సు మేనేజ్మెంట్ సిస్టం ద్వారా శానిటేషన్ , పేషెంట్ కేర్ , సెక్యూరిటీ , సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నాము . కావున మా యందు దయవుంచి రాబోయే అసెంబ్లీ సమావేశాల నందు మా కార్మికుల పక్షమున ఐ హెచ్ ఎఫ్ ఎంఎస్ విధానం రద్దు చేసి మా కార్మికులందరినీ కూడా ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ ద్వారా వేతనాలు ఇవ్వాలి అని 33 జిల్లాల ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్ , పేషెంట్ కేర్ , సెక్యూరిటీ , సూపర్వైజర్ 17,000 పైచిలుక మంది కార్మికులు కోరడంl జరుగుతుందని అన్నారు . ఇట్టి విషయము విన్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మీ యొక్క సమస్య గురించి పెద్దల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తప్పనిసరి మీకు ఏదైనా మంచి చేయడానికి తమ వంతు ప్రయత్నిస్తాను అని చెప్పడం జరిగిందని ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉబ్బని రమ, కే .ఆనంద్, రాష్ట్ర కమిటీ కోశాధికారి పత్తిపాటి శ్రీనివాస్, ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు, ఎం .వి . రమణ, జి . కుమారి తదితర సభ్యులు పాల్గొన్నారు.