- పరామర్శించిన సిపిఎం నేతలు
ఖమ్మం రూరల్, ఆర్గాన్ న్యూస్:
మాజీ ఎమ్మెల్యే,ఎంపీ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందిన అనంతరం తన స్వగ్రామమైన ఏదులాపురం మున్సిపాలిటీలోని తెల్దార్‌పల్లి గ్రామానికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు, ఖమ్మం జిల్లా సిపిఎం కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల కమిటీ సభ్యుడు వరగాని మోహన్ రావు, గ్రామ శాఖ కార్యదర్శి వరగాని వెంకటేశ్వర్లు, పొన్నెకల్ గ్రామ సర్పంచ్ కోటి శ్రీనివాసరావు, పార్టీ గ్రామ నాయకులు వరగాని కిరణ్, కొత్త శ్రీనివాసరావు, నూతల జనార్దన్ రావు, వరగాని పెద్ద నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ శ్రేణులు తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.


