Home క్రైమ్ పూరిళ్లు అగ్నికి ఆహుతి

పూరిళ్లు అగ్నికి ఆహుతి

14
0
  • నాలుగు ఇళ్లు బూడిద, భారీ ఆస్తి నష్టం

వేలేరుపాడు, ఆర్గాన్ న్యూస్,మార్చి 30:

వేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి గ్రామంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించి నాలుగు పూరిళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
ఒక గృహానికి మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసి పడగా, వెంటనే పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో చంద్రుగొండ సత్తిబాబు, చిన్న నరసింహులు, ఎక్కిల శ్రీను, రింగ్ బాబు లకు చెందిన ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినప్పటికీ, భారీ ఆస్తి నష్టం సంభవించింది. గృహాలలో ఉన్న వస్త్రాలు, నగదు, ఆభరణాలు సహా అన్ని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. పూరిళ్లు కావడంతో ఇళ్లలోని ప్రతి వస్తువు బూడిదై బాధితులు నిరాశ్రయులయ్యారు.
బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు, బాధితులు అధికారులను కోరుతున్నారు.