- రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం కాలనీలో ప్రారంభం
మధిర, ఆర్గాన్ న్యూస్,మార్చి 3:
మాజీ కేంద్ర మంత్రి,రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి నిధులతో అతి తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే ఆధునిక ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నిధుల సాధనలో స్థానిక నాయకుడు శ్రీ జవ్వాజి ఆనందరావు చూపిన చొరవ, పట్టుదల అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.
తొలి విడతలో భాగంగా మధిర మండలం పరిధిలోని ఇల్లూరు గ్రామంలో సుమారు 100 ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ముస్లిం కాలనీ నుండి ఘనంగా ప్రారంభించారు. ఎంపీడీవో బి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, సర్పంచ్ శ్రీమతి చేకూరి ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం.పి.ఓ. టి.వి.ఎల్.ఎన్. శాస్త్రి హాజరై ఎల్‌ఈడీ దీపాలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ముస్లిం కాలనీ నివాసితులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసినందుకు శ్రీమతి రేణుక చౌదరి కి గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అధునాతన ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు వల్ల గ్రామంలో విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా రాత్రి వేళల్లో భద్రత మెరుగుపడుతుందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభివృద్ధి పనులు గ్రామానికి కొత్త వెలుగులు తీసుకువచ్చాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.


