ప్రతిభకు పట్టం కట్టాలి తప్ప కులం పేరుతో రిజర్వేషన్లు ఉండొద్దు
బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య క్రమశిక్షణ కమిటీ చైర్మన్, వక్క లంక శ్రీనివాసరావు రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, మార్చి 31: రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయాలని కింది జాతి పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్ లను ప్రభుత్వం తొలగించాలని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వక్క లంక శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇటీవల ఎంఆర్పిఎస్ నాయకులు, మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ బ్రాహ్మణులు దేవాలయాల్లో పూజలు చేయవద్దని ఒక సమావేశంలో మాట్లాడడం అది బ్రాహ్మణులను కించపరచడమేనని సమాజం నాగరికత నేర్చుకోక ముందు నుండే బ్రాహ్మణుడి మాటను సమాజం గౌరవించిందని,ఆయన చెప్పిన మంచి రోజునే శుభకార్యాలను చేసుకుంటున్న సమాజం మనది.. అని, అలాంటి సమాజంలో జీవిస్తున్న మందకృష్ణ మాదిగ బ్రాహ్మణులను కించపరుస్తూ… సర్వేజనా సుఖినోభవంతు అంటూ… తమ వృత్తి తాము చేసుకుంటున్న బ్రాహ్మణులు ఆ వృత్తిలో కొనసాగరాదని అనడం తగదని, అందుకే మాకు కడుపు మండి, రక్తం ఉడికి, రిజర్వేషన్లు ఎత్తివేయాలి అనే వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందని…తక్షణమే మంద కృష్ణ మాదిగ తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని, యావత్ బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పి సమాజంలో తిరగాలని లేకపోతే బ్రాహ్మణ జాతి అతనికి తగిన బుద్ధి చెబుతుందని, హెచ్చరించారు. కులాలను అడ్డుపెట్టుకొని రిజర్వేషన్లు అనుభవిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న బ్రాహ్మణ కులాలను కించపరచినట్లు మాట్లాడడం క్షమించరాన్ని నేరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు… మంద కృష్ణ మాదిగ…..నువ్వు పుట్టినప్పుడు నీ జన్మ దినోత్సవాన్ని ఏరోజు చేయాలి అని, నీ పెళ్లి ఏ తేదీలో జరపాలని ముహూర్తం చూసి చెప్పినవాడు బ్రాహ్మణుడు కాదా, ఒక్కసారి ఆలోచించుకోవాలని, ఇలాంటి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే సమాజం నీకు గుణపాఠం చెబుతుందని, ప్రజాసేవలో ఉన్న నీవు ప్రజలలో భాగంగా ఉన్న బ్రాహ్మణుల గురించి మాట్లాడడం నీ నీ మూర్ఖత్వానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ఇకనైనా మందకృష్ణ మాదిగ యావత్ బ్రాహ్మణ జాతికి క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తమ ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామని హెచ్చరించారు.