Home తెలంగాణ ఇబ్బంది పెడితే తిరుగుబాటే !

ఇబ్బంది పెడితే తిరుగుబాటే !

29
0
  • ప్రభుత్వ ప్రొధ్బలంతో అటవీశాఖ అధికారులు పొడు రైతులను ఇబ్బంది పెడితే తిరుగుబాటు తప్పదు
  • పట్టాలు ఉన్న పోడు భూములలో ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులు
  • బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మార్చి 3:

ప్రభుత్వ అండతో అటవీశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పట్టాలున్నా గిరిజన పోడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని
బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో గిరిజన పొడు రైతులు ఎన్నో ఏళ్ళుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల పోడు భూములపై ఫారెస్ట్ అధికారులతో దౌర్జన్యం చేపించడం సిగ్గుచేటు అని అన్నారు.స్థానిక మంత్రికి ఇంత జరుగుతుంటే కనపడటం లేదా అని ప్రశ్నించారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్ గిరిజన రైతులకు పోడు పట్టాలిచ్చి గిరిజన రైతులకు న్యాయం చేశారని అన్నారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములను గిరిజనుల నుండి ఫారెస్ట్ అధికారులతో లాక్కోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు ఆదివాసీలను అటవీశాఖ అధికారులు ఇబ్బంది గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని మాటలు చెప్పిన మంత్రి సీతక్క ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఇప్పుడు గిరిజనులు కనపడడం లేదా అని దుయ్యబట్టారు పోడు రైతులకు అండగా ఉంటామని గిరిజన రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి అన్నారు.