- పోడు వ్యవసాయ భూములలో ఫారెస్ట్ అధికారుల మొక్కలు నాటే ప్రయత్నం
- అడ్డుకున్న పోడు వ్యవసాయ ఆదివాసి రైతులు
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మార్చి 3:
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలువపల్లి గ్రామం లో గత 30 సంవత్సరాల కాలం నుండి ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు వ్యవసాయా భూములలో ఫారెస్ట్ అధికారులు జెసిపి తో కందకాలు తీసి మొక్కలు నాటడం కోసం పోడు వ్యవసాయ భూమిలోకి వచ్చారు. ఆ భూముల చుట్టూ ఫ్రెంచ్ చేయడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను గమనించిన పోడు వ్యవసాయ ఆదివాసి రైతులు అది గమనించి తెలుసుకొని ఆదివాసులు జెసిపి దగ్గరకు వెళ్లి అడ్డుకోవడం జరిగినది. పోడు వ్యవసాయ ఆదివాసీలు మాట్లాడుతూ గత 30 ఏళ్లకు పైబడి సాగు చేసుకుంటున్నా పోడు భూములను సేద్యం చేసుకుని బ్రతుకుతుంటే పోడు భూములను సాగు చేసుకుంటున్నప్పుడు భూముల చుట్టూ కందకాలు తీయవద్దు చెట్లు నాటవద్దు అని నిరసన వ్యక్తం చేయడం జరిగినది. ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల పై జూలు చూపిస్తూ వారిని విచక్షణ రహితంగా కొడుతూ జెసిపిని ప్రజలపైకి తీసుకొని వస్తున్నారు. ఆదివాసీలు గమనించి జెసిబిని అధికారులను అడ్డుకోవడం జరిగింది. గతములో తాడ్వాయి మండలంలోని జనగాలంచ వద్ద ఇదేవిధంగా ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలపై లాఠీచార్జీలతో కొడుతూ విచక్షణ రహితంగా వారిని మానసికంగా వేధించడం కూడా జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఏజెన్సీలో ఉండవడిన ఆదివాసి గ్రామాలలో పోడు వ్యవసాయం చేసుకునే వారి రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని ప్రజలు ప్రజా సంఘాలు ఆదివాసి సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఆదివాసి పోడు రైతులను ఇబ్బందులు పెట్టకూడదని అన్నారు.


