- ఖమ్మం వెళుతున్న రఘును అరెస్టు చేసి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్ ఫిబ్రవరి 25: ఖమ్మం జిల్లాలో, పేదల గుడిసెలు ప్రభుత్వం పోలీసు బందోబస్తుతో కూల్చి వేస్తున్న నేపథ్యంలో అక్కడిక కవరేజి కోసం వెళ్లిన జర్నలిస్ట్ రఘును అరెస్టు చేయడం, దురదృష్టకరమని ప్రగతిశీల యువజన సంఘం హైదరాబాద్ నగర కార్యదర్శి కొల్లూరు భీమేష్ ఆరోపించారు. బుధవారం నాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజాస్వామిక వాదులారా, మేధావులారా, విద్యార్థులారా, కార్మిక కర్షకులారా, ఇలాంటి సమస్య ఉత్పన్నమైతే నిజాయితీ అనే పదానికి అర్థం ఎక్కడ ఉందో చెప్పండి అని నిలదీశారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 (1 ) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న సందర్భంలో బాధితుల పక్షాన మాట్లాడడం నేరమా అని అన్నారు. జర్నలిస్టు సోదరులు కూడా బ్రిటిష్ పాలనను తలదన్నే నీచమైన పాలన కొనసాగుతుంటే నోరు ఎందుకు మెదపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభం అయిన జర్నలిస్టులకు ప్రజా పాలనలో రక్షణ లేకుండా పోయిందని ఇకనైనా ఇలాంటి సంస్కృతి పరంపర కొనసాగితే భారతదేశ ప్రజలకు మౌలిక హక్కులకు భంగం కలిగే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుందని, ఈ భారత ప్రజానికం చైతన్యంతో ఖండించవలసిన సమయం ఆసన్నమైందని, కొల్లూరి భీమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


