భారత్ సేవా సహకార్ ఫోరం ( బి ఎస్ ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో.. రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 16: భారత్ సేవా సహకార్ ఫోరం( బి ఎస్ ఎస్ ఎఫ్ ) ఆధ్వర్యంలో, శనివారం నిజాంపేట బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్స్ లో భారత సేవా సంజీవని ఫండ్ ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. వ్యవస్థాపకులు చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ దార్శినిక, నాయకత్వంలో బి.ఎస్ ఎస్.ఎఫ్.,పేదలు, వెనుకబడిన వర్గాల కోసం, ధార్మిక, మత, సామాజిక, వైద్య, శాస్త్రీయ, సాహిత్య, విద్య, మరియు ఆరోగ్య కార్యక్రమాలకు అంకితం అయిన సంస్థ గా భాగ్యనగరంలో మంచి పేరు ఉంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో వందలాది మంది కళాశాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది హౌస్ కీపింగ్ సిబ్బంది, ఉచిత సాధారణ ఆరోగ్య పరీక్ష నిపుణుల సంప్రదింపులు అవసరమైన మందుల నుండి ప్రయోజనం పొందారు అని నిర్వహకులు తెలిపారు. వైద్య భాగస్వాములు ఈ వైద్య శిబిరంలో డి.డి.హెచ్. రెనేవా ఆస్పత్రి, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేఫ్రాలజీ అండ్ యూరాలజీ, శ్రీ శ్రీ హోలీ స్టిక్ క్లౌ డెంటల్ సోమ్నిఫెరా నుండి వైద్యులు నర్సులు సిబ్బంది తమ నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించారు. ఈ సంస్థలతో సమన్వయం చేసుకొని వారి భాగస్వామ్యానికి కృషి చేసి తన సమయాన్ని కేటాయించినందుకు ఈ సందర్భంగా పి ఆర్ ఓ నర్సింగ్ లతా రాణి కి , అదేవిధంగా ఉచిత వైద్య శిబిరానికి కావలసిన మౌళిక సదుపాయాలు, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవలు అందజేసినందుకు శ్రీమతి డాక్టర్ కళా బీమా అసిస్టెంట్ ప్రొఫెసర్ లకుబి ఎస్. ఎస్. ఎఫ్.కృతజ్ఞతలు అందజేసింది. ఈ కార్యక్రమంలో నెట్ క్రాకర్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉదారమైన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సి ఎస్ ఆర్ ) సహకారం ఉచిత మందులు వైద్య సేవలకు నిధులు సమకూర్చిందని అవసరమైన వారికి సంరక్షణ అందించిందని సేవ యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించినందుకు అన్ని భాగస్వామ్యాలకు స్వచ్ఛంద సేవకులుగా పాల్గొన్న వారికి, పాత్రికేయ బృందానికి బిఎస్ఎస్ఎఫ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. వేదిక భాగస్వామిగా బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైద్య శిబిర నిర్వహణకు బి వి ఆర్ ఐ టి, హైదరాబాద్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కళాశాల ప్రాంగణం అవసరమైన సౌకర్యాలను అందించి సమాజసేవ సామాజిక బాధ్యత పట్ల నిబద్ధతను కనబరిచిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ఎస్ఎస్ ఫ్యాకల్టీ కళా భీమా కు ఆమె బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు బి ఎస్ ఎస్ ఎఫ్ తెలిపింది.