Home తెలంగాణ అత్యవసర వేళ అండగా 108 సేవలు

అత్యవసర వేళ అండగా 108 సేవలు

51
0
  • శంకరపట్నంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 17:

కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం లో 108 అంబులెన్స్ సేవలు ప్రజల ప్రాణరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. మంగళవారం మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని శంకరపట్నం మండల కేంద్రంలో 108 వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వాహన పరిస్థితి, అత్యవసర పరికరాలు, రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, ఇతర అనుకోని ఘటనల్లో గాయపడిన వారికి ప్రభుత్వం అందిస్తున్న 108 అంబులెన్స్ సేవలు సమయానికి చేరుకొని ప్రాణాలను కాపాడుతున్నాయని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ ద్వారా 108కు సమాచారం అందిన క్షణాల్లోనే ఈఎంటి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హుజురాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు బాధితులను తరలిస్తున్నట్లు వెల్లడించారు.
శంకరపట్నం మండల 108 సిబ్బంది సేవాభావంతో పనిచేస్తూ ప్రజల గుండెల్లో నిలుస్తున్నారని, తన ఆకస్మిక తనిఖీలో వాహనం, పరికరాలు సక్రమంగా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. సిబ్బందిని అభినందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి, పైలట్ ఖాజా ఖలీల్ ఉల్లా తదితరులు పాల్గొన్నారు.