Home క్రైమ్ పదిహేనేళ్ల బాలిక పై యువకుడి లైంగిక దాడి?

పదిహేనేళ్ల బాలిక పై యువకుడి లైంగిక దాడి?

22
0
  • గర్భం దాల్చడంతో ఆలస్యంగా వెలుగులోకి ?
  • తండా నుండి పరారైన యువకుడు!
  • రాజీ కోసం షాడో సర్పంచ్ మధ్యవర్తిత్వం ! తిరుమలయపాలెం ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 16 :

అభం శుభం తెలియని వయసు,నిండా పదిహేనేళ్లు కూడా నిండని బాల్యం,తండ్రి లేని ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు కన్నేశాడు..మాయ మాటలు చెబుతూ దగ్గరయ్యాడు..బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో బెదిరింపులకు గురి చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు..ఫలితంగా బాలిక గర్భం దాల్చింది..ఇదేంటని అడిగితే తనకేం సంబంధం లేదని ముఖం చాటేశాడు..మండలంలోని తండా గా పిలువబడే ‘ఓ తండాకి చెందిన ఓ యువకుడు’ బాలిక ఇంటి చుట్టూ తిరుగుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.కొన్ని రోజుల అనంతరం బాలిక అనారోగ్యానికి గురైంది వాంతులు,కళ్ళు తిరగడం,జ్వరంతో బాధపడుతూ ఉండటం శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లి బాలికను ప్రశ్నించగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో సదరు యువకుడు ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేశాడని జరిగిన దారుణాన్ని తెలిపింది. కనీస లోకజ్ఞానం తెలియని తల్లికి ఏమి చేయాలో తెలియక తండాలో సన్నిహితులుగా ఉండే వారికి తెలియపరచింది.దీంతో వారు ఆ యువకుడి ఇంటికి వెళ్లి నిలదీయగా తనకేం సంబంధం లేదంటూ బుకాయించాడు.యువకుడి తల్లితండ్రులు సైతం తమ కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని వాగ్వాదానికి దిగారు.అంతటితో ఆగకుండా ఉండకుండా యువకుడిని కొన్ని రోజుల పాటు వేరే ఊరికి పంపించి చేతులు దులుపుకున్నారు.దీంతో బాలిక సన్నిహితుల సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.దీంతో షాడో సర్పంచ్ గా వ్యవహరించే ఓ వ్యక్తి,మరో వ్యక్తితో కలిసి బాలికకు జరిగిన అన్యాయాన్ని బయటకి పొక్కకుండా మధ్యవర్తిత్వం వహించి గోప్యంగా ఉంచుదామని అనుకున్నారు..ఇప్పటికే తండాలో ఓ వ్యక్తి ఓ బాలిక పై అత్యాచారం చేసి గర్భవతిని చేయగా ఫోక్సో కేసు నమోదై జైలుకి వెళ్లాడని,పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఈ యువకుడి పై కూడా ఫోక్సో కేసు నమోదవుతుందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకుండా రాజీ చేసే ప్రయత్నం చేశారు. రేపు,మాపు అంటూ కాలయాపన చేయడం,బాలికకు న్యాయం చేయకపోవడం,బాలికకు గర్భం నెలలు పెరగడంతో,దిక్కుతోచని ఆ బాలిక యువకుడి ఇంట్లోనే దీక్షకు దిగడంతో విషయం తండా మొత్తం వ్యాపించి, కచ్చితంగా పోలీస్ కేసు నమోదవుతుందని భావించి పెళ్లికి సిద్ధమైనట్లుగా.. అన్నీ ఆశలుడిగి చేసేది లేక చివరికి పెళ్ళికి సిద్దమైనట్లు సమాచారం.. ఇదంటా సరే.. బాలిక మైనర్ ఈ విషయం సంగతేంటి ? మైనర్ వివాహం చట్ట విరుద్ధం ! ఈ మాత్రం తెలియదా ఈ రోజుల్లో పంచాయతీ పెద్దలకు.. తెలిసీ ఇలా చేస్తున్నారంటే మరి గర్భం సంగతేంటి ? అది కూడా సడీ సప్పుడు కాకుండా తీపిస్తారా ? ఒక్క పెళ్లి అంగీకారంతో ఇవన్నీ సమసి పోతాయా.. దీనిపై సోషల్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించడం చాలా అత్యావస్యం ఉన్నా కూడా ప్రభుత్వ యంత్రాంగం నిద్ర పోతుంది.. తండా లలో
గూడే లలో సరైన మార్గంలో లేని పిల్లలు అల్లరి చిల్లరగా తిరిగి అమాయక మైనర్లను ఆకర్శించి లొంగదీసుకొని అనుభవించి ఆగమై పోతున్నా ప్రభుత్వ శాకలు,అధికారులు దృష్టి పెట్టడం లేదు.. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా తండాలు ఉన్న పాలేరు డివిజన్ లో జరుగుతున్నాయి ఇది మంత్రి పొంగులేటి నియోజకవర్గం ఆయనకు గిరిజనులంటే బాగా మమకారం..దీనిపై యంత్రాంగం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తండా ప్రజలు కోరుచున్నారు.