రేపల్లెవాడ సర్పంచ్ మడిపల్లి అంబికా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
✍️ది.21.12.2025 ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం రేపల్లెవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మడుపల్లి అంబికా సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,ఖమ్మం డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ,ఖమ్మం డిసిసి మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గం లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపోందారన్నారు.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు భాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని అన్నారు.. రాబోయే ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పన చేయాలని అన్నారు..


