- తరగతి గదులకు తాళాలు
- పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒక్కడే..
కనపడని మిడ్ డే మీల్స్ వర్కర్స్
కల్లూరు, ఆర్గాన్ న్యూస్,డిసెంబర్ 3:
మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు లేక ఖాళీగా దర్శనమిచ్చింది.ప్రధాన ఉపాధ్యాయుడు బానోత్ లక్ష్మణ్ ను వివరణ కోరగా గత సంవత్సరం విద్యార్థులు లేక మూసివేసిన పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పునః ప్రారంభించారు.దానితోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న గాని అక్కడ విద్యార్థుల కొరత.ఒకటి నుంచి ఏడు తరగతి వరకు అవకాశం ఉన్నప్పటికీ ముగ్గురు విద్యార్థులతోనే తరగతలు కొనసాగిస్తున్నారు.విద్యార్థులు లేకపోవడంతో తరగతి గదులకు తాళాలు వేసిన పరిస్థితి నెలకొంది.ఒక తరగతి గదిలో మాత్రం
ఉపాధ్యాయుడు ఉన్నాడు.ఉన్న ముగ్గురు విద్యార్థులలో ఒక్కరు కూడా కనపడని తీరు.ముగ్గురు విద్యార్థులు ఒకటవ తరగతిలో ఇద్దరూ, రెండో తరగతి ఒక్కరు ఉన్నట్టుగా ఉపాధ్యాయుడు తెలిపారు.గతంలో మూసివేసిన తర్వాత పునః ప్రారంభించినప్పుడు 12 మంది విద్యార్థులు ఉన్నారని అనంతరం క్రమంగా తగ్గుతూ చివరికి ముగ్గురు మాత్రమే మిగిలారని తెలిపారు.పెరిగిన విద్యార్థులు ఎందుకు తగ్గారనే విచారణ లేదు.ఆ ముగ్గురు విద్యార్థులతో ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్నారు.పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టాల్సిన మిడ్ డే మిల్స్ వర్కర్స్ కనిపించకపోవడం పాఠశాలలో నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది.ప్రభుత్వం అన్ని విధాలుగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా అడుగులు వేస్తూ మెస్ చార్జీలు పెంచి ప్రభుత్వ ధనాన్ని పాఠశాలకు వెచ్చిస్తుంటే ఇక్కడ మాత్రం పాఠశాలలో మిడ్ డే మిల్స్ పిల్లలకు అందుతున్నట్లు లేదని స్థానికులు తెలిపారు.విద్యార్థులు పాఠశాలలో లేకున్న ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ప్రభుత్వ బడులపై ఉన్నత అధికారులు దృష్టి సారించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని,విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


