- జాతీయ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో నల్గొండ జిల్లా పోలీసుల స్పష్టీకరణ
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జనవరి 3:
జాతీయ రోడ్డు భద్రత అవగాహన–2026 కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నల్గొండ జిల్లా పోలీసు శాఖ సూచించింది. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు పెట్రోల్ అందించకూడదన్న విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల తలగాయల తీవ్రత తగ్గి ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన భద్రతతో పాటు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హెల్మెట్‌ను తప్పనిసరిగా వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. “హెల్మెట్ ధరించండి – సురక్షితంగా ప్రయాణించండి – మీ భవిష్యత్తును భద్రపరచుకోండి” అని ఆయన సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.








