Home POLITICS ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తున్నాం

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తున్నాం

100
0
  • సీపీఎం

ఖమ్మం టూ టౌన్, ఆర్గాన్ న్యూస్, మార్చి 5:

ప్రపంచ శాంతికి భంగం కలిగించేలా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేపడుతున్న దురాక్రమణ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం పార్టీ పేర్కొంది. అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో వివిధ దేశాలపై దాడులు కొనసాగించడం తప్పుడు చర్య అని విమర్శించింది.
ఇజ్రాయిల్ ఇప్పటికే పాలస్తీనాపై దాడులు జరిపి వేలాది మందిని హతమార్చిందని, ఇప్పుడు అమెరికాతో కలిసి ఆయిల్ ఆధిపత్యం కోసం ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుందనే నెపంతో దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొంది. ఈ దాడుల్లో ఇరాన్ అధ్యక్షుడు, ఉన్నతాధికారులు, వందలాది మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మానవత్వానికి విరుద్ధమని తెలిపింది.
అదేవిధంగా విద్యాసంస్థలపై దాడులు చేసి విద్యార్థులను హతమార్చడం అత్యంత దుర్మార్గపు చర్య అని సీపీఎం ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే యుద్ధ దాడులను నిలిపివేసి శాంతి చర్చలు ప్రారంభించాలని, యుద్ధ పరిస్థితులను నివారించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది.
ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం స్పందించి, ఐక్యరాజ్యసమితి తక్షణం జోక్యం చేసుకుని శాంతి స్థాపనకు చర్యలు తీసుకోవాలని సీపీఎం కోరింది. గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి అమెరికా ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఐద్వా రాష్ట్ర నాయకురాలు బండి పద్మ జిల్లా నాయకులు రాజారావు రైతు సంఘం నాయకులు రమేష్,ఎర్ర శ్రీనివాస్,వై విక్రం, నవీన్ రెడ్డి, పట్టణ కార్మిక సంఘాల నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.