Home POLITICS సర్పంచులకు సీఎం శుభవార్త

సర్పంచులకు సీఎం శుభవార్త

34
0


హైదరాబాద్:ఆర్గాన్ న్యూస్
గ్రామ పాలనను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సర్పంచుల అధికారాలు, విధులపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన నిధులు, సౌకర్యాలు కల్పించడంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు.
సర్పంచుల గౌరవాన్ని పెంచేలా, వారిని నిర్ణయాధికారులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టే అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.