Home ఎడ్యుకేషన్ సమయం సరిపోదా?

సమయం సరిపోదా?

28
0
  • అక్కినేపల్లి పురుషోత్తమరావు ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి: చాలామంది విద్యార్థులు సమయం సరిపోలేదని బాధపడుతూ ఉంటారు. చదవడానికి కాదు రాయడానికి కూడా సమయం లేదు అంటుంటారు. నిజానికి పాఠ్యాంశాల రూపకల్పన పరీక్ష సమయంలో ఇచ్చే ప్రశ్నావళి సాధారణంగా విద్యార్థులకు తగిన విధంగా ఉండేలా అధికారులు జాగ్రత్త పడతారు అలాగే పోటీ పరీక్షలలో కూడా ఎక్కువ మందికి అర్థమయ్యే ప్రశ్నలే ఇస్తుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే మెలుకువలు పాటిస్తే ఆడుతూ పాడుతూ చదవచ్చు పరీక్షలను పండగల ఆస్వాదించవచ్చు. అందుకోసం విద్యారంగా నిప్పునులు నిర్వహణరంగా నిప్పును రూపాలు జాగ్రత్తలు సూచిస్తున్నారు సమయపాలన లేదా నిర్వహణ అన్నం కంటే జీవన నిర్వహణ పాటించడం అన్న మాట సరి అయిందని మానసిక నిపుణులు అంటున్నారు. కాలం సమయం అందరికీ ఒకటే అన్న విషయం కాదనలేని సత్యం అయితే మన జీవనశైలి విధానం పై సమయం వినియోగం ఆధారపడి ఉంటుంది. విద్యార్థులైన మహోన్నత స్థానంలో ఉన్న వారైనా ఇదే సూత్రం వర్తిస్తుంది మంచి మార్కులు ర్యాంకులు సాధించాలనుకునే విద్యార్థులు కొన్ని సూచనలు పాటిస్తే విజయం దానంతట అదే సిద్ధిస్తుంది. లక్ష్య నిర్దేశ్యం విద్యార్థులు వారు చదువుతున్న తరగతులను బట్టి సరైన లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఏది చదవాలి ఎందుకు చదవాలి ఎలా చదవాలి అనే అంశంపై దృష్టి పెట్టాలి తమ తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం, సామర్థ్యం అంచనా వేసుకోవాలి. వెనుకబడుతున్నామంటే అందుకు కారణాలు తెలుసుకొని పరిష్కరించుకోవాలి అవసరాన్ని బట్టి అధ్యాపకులు తల్లిదండ్రులు సహాయ సహకారాలు పొందాలి శారీరక మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రాధాన్యత పాటించాలి ఉన్న సమయంలో అన్ని పనులు ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు మనం చేసే పనులలో అత్యవసరం అవసరం అతి ముఖ్యం ముఖ్యం అనవసరం అన్న వాటిని గుర్తించాలి. ముఖ్యమైన అవసరం అయిన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులకు చదవడం నేర్చుకోవడం లాంటివి అవసరం అయిన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి సినిమాలు చాటింగ్ లాంటివి అనవసరం కాబట్టి ముఖ్యమైన అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సమయం విభజన ప్రతి వ్యక్తికి రోజుకు 24 గంటలే ఉంటాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏడు ఎనిమిది గంటలు నిద్ర అవసరం స్నానం భోజనం చేయడం పాఠశాల కళాశాలకు వెళ్లడం శారీరక వ్యాయమాలు క్రీడలు సరదాలకు 6 నుంచి 8 గంటలు కావలసి ఉంటుంది మిగిలిన సమయంలో 8 నుంచి 10 గంటలు కంటే చదవడానికి కుదరదు అలా అని నిద్ర ఆహారం వ్యాయామం విశ్రాంతికి సమయం తగ్గించి చదువుకు కేటాయిస్తే సామర్థ్యం దెబ్బతింటుంది ఏకాగ్రత జ్ఞాపకశక్తి క్షీణిస్తాయి ఆఖరికి ఓటమి వెక్కిరిస్తుంది సమయ విభజన అన్నది ప్రణాళికాబద్ధంగా ఉండాలి. మెళుకువలు నేర్చుకోవాలి చదువు క్రీడలు వృత్తి ఉద్యోగం ఏదైనా మేలుకోలు నైపుణ్యాలు నేర్చుకున్న వారే విజయతలు అవుతారు విద్యార్థులు చదవడం రాయడం గుర్తుపెట్టుకోవడం వంటి అంశాలలో పట్టు సాధించాలి బట్టి పట్టడం కంటే విషయ పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలి మౌలిక లేక ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవాలి ప్రతిసారి మొదటి అక్షరం నుంచి ఆఖరి అక్షరం వరకు చదవడం మానాలి పునఃశ్చరణ చేసే సమయంలో ముఖ్యమైన అంశాలు చదివితే సమయం సరిపోతుంది. ఒత్తిళ్ళ నిర్వహణ ఎక్కువ శాతం మంది విద్యార్థులు మానసిక వత్రికి గురి అవుతూ ఉంటారు ఇలాంటి వారు చదువులో మెలకువలతో పాటు ఒత్తిళ్ళ నిర్వహణ నేర్చుకోవాలి సమతుల ఆహారం సరియైన వ్యాయామం తగినంత నిద్ర విశ్రాంతికి సమయం కేటాయించాలి భయం ఆందోళన లేదా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి ధ్యాన సాధన ఇతర ఉపశమన పద్ధతులు పాటించాలి.