Home క్రైమ్ రేషన్ బియ్యం దందాపై పీడీ యాక్ట్ అమలు

రేషన్ బియ్యం దందాపై పీడీ యాక్ట్ అమలు

13
0
  • ఆత్మకూరి జగదీష్‌ను చంచలగూడ జైలుకు తరలింపు

ఖమ్మం, ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్ 17:

రేషన్ బియ్యం దందాలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆత్మకూరి జగదీష్‌పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పేదలకు ఉచితంగా అందాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఖమ్మం జిల్లాలో 13 కేసులు, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో మరో రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగదీష్ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీర్ఘకాలంగా ఈ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేసి హైదరాబాద్ చంచలగూడ సెంట్రల్ జైలుకు తరలించారు.
పేదల కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. రేషన్ బియ్యం మాఫియాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు.