Home తెలంగాణ పోడు సాగు భూముల్లో కందకాలు తీయడం నిలిపివేయాలి

పోడు సాగు భూముల్లో కందకాలు తీయడం నిలిపివేయాలి

27
0
  • ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్

ములుగు జిల్లా,ఆర్గాన్ న్యూస్,మార్చి 28:

ఏటూరు నాగారం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అటవీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
సంఘం నాయకులు దుగ్గి చిరంజీవి, గొంది రాజేష్ మాట్లాడుతూ, కన్నాయిగూడెం మండలం మల్కంపల్లి గ్రామానికి చెందిన 26 వలస ఆదివాసీ కుటుంబాలు గత 20 సంవత్సరాలుగా పోడు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పోడు భూముల సర్వే నిర్వహించినప్పటికీ, ఎస్టీ సర్టిఫికెట్లు లేని కారణంగా హక్కు పత్రాలు ఇవ్వలేదని పేర్కొన్నారు.
అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క అధికారంలోకి వచ్చిన తరువాత పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా హక్కు పత్రాలు ఇవ్వలేదని విమర్శించారు. అంతేకాకుండా, సాగులో ఉన్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తీయడం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు.
వెంటనే మంత్రి సీతక్క స్పందించి కందకాలు తీయడం నిలిపివేయాలని, లేనిపక్షంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తోలం కృష్ణయ్య, కోరం చిరంజీవి, జజ్జరి దామోదర్, పునెం నాగేష్, తోకల రవి, బాలు, గ్రామస్తులు సోయం భద్రయ్య, పునెం సుక్కయ్య, కొడియం పవన్, సోడి దేవా, మడకం బండయ్య, సోడి జోగేందర్ తదితరులు పాల్గొన్నారు.