Home Uncategorized మద్యం దుకాణాలు బంద్

మద్యం దుకాణాలు బంద్

19
0
  • ఇవ్వాళ సాయంత్రం నుండి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేంత వరకు
  • పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఆర్గాన్ ఖమ్మం డిసెంబర్ 8 :

డిసెంబర్ 11, 14, 17 తేదీలలో జరిగే మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11 న జరిగే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 9 వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుండి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలన్నారు.
అదే విధంగా డిసెంబర్ 14 న జరిగే రెండో విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 12 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి డిసెంబర్ 14న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని సీపీ అన్నారు. డిసెంబర్ 17 న జరిగే మూడో విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 15 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి డిసెంబర్ 17న ఎన్నికల ముగిసి, ఓట్ల లెక్కింపు,ఫలితాలు వెల్లడించే వరకు ఏన్కూరు, కల్లూరు,పెనుబల్లి, సత్తుపల్లి,తల్లాడ,వేంసూర్,సింగరేణి మండలాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని సీపీ తెలిపారు.
మద్యం దుకాణాలతో పాటు పై తేదీలలో ఆయా మండలాల్లో వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, మూసివేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలలో భాగంగా మూసివేయాలని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కోరారు.