Home POLITICS కొండాయిలో కాంగ్రెస్ జైత్రయాత్ర స్పష్టం

కొండాయిలో కాంగ్రెస్ జైత్రయాత్ర స్పష్టం

26
0
  • సర్పంచ్ అభ్యర్థి సంధ్యారాణి గెలుపు ఖాయం!
  • మంత్రి సీతక్క

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 8:

ఏటూరునాగారం మండలంలోని మారుమూల కొండాయి గ్రామాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క సందర్శించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుర్సం సంధ్యారాణిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.
గ్రామానికి ఉపసర్పంచ్‌గా పనిచేసిన కుర్సం మహేష్ సేవలను మంత్రి సీతక్క ఈ సందర్భంగా గుర్తుచేశారు. వరదల సమయంలో గ్రామస్థుల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తూ అనేకసార్లు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేసిన మహేష్, గోవిందారాజు ఆలయం చుట్టూ గోడ నిర్మాణం కోసం ఆతృతగా శ్రమించిన విషయాన్ని ఆమె వివరించారు.
కొండాయిని మరింత అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న మహేష్ సతీమణి కుర్సం సంధ్యారాణిని విజయం సాధింపజేయాలని మంత్రి సీతక్క గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
సర్పంచ్ అభ్యర్థి కుర్సం సంధ్యారాణి మాట్లాడుతూ-
రాష్ట్ర మంత్రి సీతక్క సహకారంతో కొండాయి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, భవిష్యత్‌లో దొడ్ల-కొండాయి గ్రామాల మధ్య ప్రవహించే జంపన్న వాగు ఇరువైపులా కరకట్టల నిర్మాణం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిటమాట రఘు, కొండాయి గ్రామ కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.