రామాయణ్ రీసర్చ్ కౌన్సిల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, సౌత్ ఇండియా కన్వీనర్ యర్రం వెంకటరెడ్డి రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, జూన్ 9: రామాయణ పరిశోధన మండలి న్యూఢిల్లీలో నమోదైన ఒక ట్రస్టు సీతామర్హి పునౌరా ధామ్ లో అంతర్జాతీయ “శక్తి క్షేత్రం” విశ్వనారీ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని రామాయణ్ రిసర్చ్ కౌన్సిల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, సౌత్ ఇండియా కన్వీనర్ యర్రం వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామాయణ పరిశోధన మండలి న్యూఢిల్లీలో నమోదైన ఒక ట్రస్టు అని ఇది 2020లో ఏర్పడిందని ఈ మండలి సాధువుల మార్గదర్శకత్వం దిశా నిర్దేశంలో నిరంతరం పనిచేస్తూ ఉంటుందని మన దేశ సంస్కృతి విలువలను ప్రోత్సహించడం దీని లక్ష్యమని శ్రీరాముడు సీతాదేవి జీవితాలు ఆదర్శప్రాయమైన స్ఫూర్తి అని వారి అడుగుజాడలను అనుసరించడం ద్వారా మన జీవితాలను విజయవంతంగా క్రమశిక్షణతో తీర్చిదిద్దుకోగలమని మండలి విశ్వాసం అని అన్నారు. రామాయణ పరిశోధన మండలి సీతామాత జన్మస్థలమైన సీతామర్హి పు నౌరా ధామ్ నీ ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి అక్కడ ఆమెకు ఒక అభవ్యమైన ఆలయాన్ని నిర్మించడానికి మండలి కృషి చేస్తుందని పేర్కొన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ మండలి పాట్నా కొత్త ఢిల్లీతో సహా అనేక ఇతర రాష్ట్రాలలో అవగాహన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిందని సెమినార్లు నిర్వహించిందని సాహిత్యాన్ని పంపిణీ చేసిందని అదే విధంగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించిందని మన దేశ హోం శాఖ మంత్రి అమిత్ షా, 2025 మార్చి 10న గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సీతామాత జన్మస్థలమైన పునౌరా ధామ్ సీతామాతకు ఒక భవ్యమైన ఆలయ నిర్మాణాన్ని ప్రకటించడం హర్షదాయకం అని అన్నారు 2025 ఆగస్టు 8న పునౌరా దామ్ లో భవ్యమైన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని దైవ భాష అయిన సంస్కృతాన్ని వీలైనంత విస్తృతంగా ప్రచారం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశం గా పెట్టుకున్నట్లు తెలిపారు. సీతామర్హి ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా శక్తి క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు 2020 నుండి రామాయణ రిసర్చ్ కౌన్సిల్ నిరంతరం కృషి చేస్తుందని ఈ క్రమంలో బీహార్ రాష్ట్ర మతపరమైన ట్రస్ట్ ల బోర్డు సీతామర్హీ పునౌరా ధామ్ సమీపంలో ఉన్న 834 ఏళ్ల పురాతనమైన శ్రీరామ జానకిస్థాన్ వద్ద 12 ఎకరాల భూమిని కౌన్సిల్ కేటాయించిందని అన్నారు. అఖండ జ్యోతి భారతదేశంలోని అన్ని 51 శక్తి పీఠాల నుండి తీసుకువచ్చిన పవిత్ర మట్టి జ్యోతితో ఇక్కడ ఒక అఖండ జ్యోతిని వెలిగించనున్నారని చతుర్భుజ మహాలక్ష్మి ఆలయ గర్భాలయంలో శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి దేవిని ప్రతిష్టించనున్నారని గౌరీ విష్ణు శివుడు ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. విశ్వనారీకేంద్రం ఇది కేవలం ఒక ఆలయ నిర్మాణం మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల గౌరవానికి సాధికారతకు చిహ్నం ఒక విశ్వనారి కేంద్రంగా రూపుదిద్దుకోనిందని ఈ మొత్తం మిషన్ నారిశక్తి ( మహిళా శక్తి) ద్వారా నడిపించబడుతుందని పేర్కొన్నారు. దక్షిణ భారతంలో కౌన్సిల్ విస్తరణ ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో కౌన్సిల్ తన కార్యకలాపాలను విస్తరిస్తుందని ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా దక్షిణ భారత బాధ్యుడిగా సైవక్షేత్ర పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ శివ స్వామిని నియమించారని, పోచ వరుణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ గా,దేశం రాజశేఖరరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, గుదిబండ్ల లలితని నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గామహిళా వింగ్ కు నియమించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మహిళా వింగ్ కో- కన్వీనర్ గా లావణ్య, స్నిగ్ద రాణి మిశ్రా నీ ఒరిస్సా రాష్ట్ర మహిళా వింగ్ సెక్రటరీగా నియమించడం జరిగిందని అన్నారు ఇది సీతాదేవి యొక్క జన్మస్థలం, పవిత్ర స్థలమని హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ మహిళలకు సాధికారత కల్పించడం. పై స్థాయి నుండి కిందిస్థాయి వరకు అందర్నీ భాగస్వామ్యం చేయడం ఘనమైన చరిత్ర సాంస్కృతి సంప్రదాయాలు మానవాళికి చెరువు చేయడం సంస్కారవంతమైన మంచి నడవడిక కలిగిన సమాజాన్ని పెంపొందించడమే ఈ మండలి లక్ష్యంగా ముఖ్యంగా చిన్నపిల్లలలో క్రమశిక్షణ విలువలు సంస్కృతిని పెంపొందించాలని కోరుకుంటున్నామని అందువల్ల మండలి యొక్క రామాయణం మంచ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మేము చిన్నపిల్లల లో విలువలు పెంపొందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు ఈ మండలి తన లక్ష్యాన్ని సాధించడంలో విజయవంతమైందని విశ్వంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించాలని అందుకు అందరి సహకారం కావాలని అన్నారు. అయోధ్య తరహాలోనే సీత మర్హి జిల్లాలో పునౌరా ధామ్ ( బీహార్ పాట్నా) కూడా జానకి మాత యొక్క శక్తి క్షేత్రంగా తీర్చిదిద్దుడమే కౌన్సిల్ లక్ష్యమని యర్రం వెంకటరెడ్డి వివరించారు.