Home ఎడిటోరయిల్‌, ఆర్గాన్ న్యూస్ నూతన సంవత్సరం అర్థం లేనిది

నూతన సంవత్సరం అర్థం లేనిది

33
0
  • గ్రెగోరియన్ ఆంగ్ల క్యాలెండర్ అది ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి: జనవరి01 ఖగోళ ప్రాముఖ్యత లేనిది.. డిసెంబర్ 31 వచ్చింది అంటే అందరికీ ఎక్కడలేని హడావుడి.. ఎందుకంటే న్యూ ఇయర్ అట.. అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరం మొదలవుతుందని సంబరాలు చేసుకుంటారు.. మీరంతా సంబరాలు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ మనం సమగ్రమైన భారత కాలమానిని మరిచిపోయి అర్థం లేని గ్రెగోరియన్ ( ఆంగ్ల) క్యాలెండర్ను అనుసరిస్తున్నాం అని గమనించాలి. భారతీయ కాలమానం ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం. ఒక్కసారి గమనించండి భారతీయ కాలమానం ప్రకారం సూర్యోదయంతో ఆరోజు ప్రారంభం అవుతుంది. మనకు ఒక రోజు అంటే ఇవాళ తెల్లవారుజాము నుండి తెల్లవారుజాము వరకు… కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ మాత్రం అర్ధరాత్రి పూట దినం మొదలవుతుంది. అది అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. సృష్టి ధర్మం సృష్టిలో ఏ ప్రాణి అయినా తెల్లవారుజాముననే నిద్ర లేస్తుంది. మనుషులంతా ఉదయాన్నే నిద్రలేచి ధైర్యం దిన కార్యక్రమాలకు సిద్ధమవుతారు పక్షులకు రావాలి సుమధురంగా వినిపించేది. తోటల్లో పువ్వులు వికసిస్తాయి. ఆవులు దూడలకు పాలు ఇస్తాయి. మరి ఈ చర్యలన్నీ అర్ధరాత్రి జరగడం మీరు ఎప్పుడైనా చూశారా? ప్రకృతి నియమాల ప్రకారం సాగే ఈ చర్యలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి జరుగుతాయి. మనం ఆలయాలలో సుప్రభాతం ప్రార్థనలు తెల్లవారుజామునే ఎందుకు వేస్తారు అర్ధరాత్రి ఎందుకు వెయ్యము మన పండుగలు భారతీయ కాలమానం ప్రకారమే జరుపుకుంటున్నాం గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైనా జరుపుకుంటున్నామా? భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉగాది నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. సూర్యమానమైన చంద్రమానమైన గ్రహాల గమనం ప్రకృతి ధర్మాల ప్రకారం మన కాలమానం రూపుదిద్దుకుంది. జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం అని చెప్పడానికి సరైన ప్రమాణాలు లేవు. రోమన్లు గ్రీకులు పాటించే గ్రగోరియన్ క్యాలెండర్ కాలగమనంలో అనేక మార్పులకు లోనైంది. యూరప్ దేశాల వలస పాలన ద్వారా ప్రపంచ దేశాల నుండి పైన బలవంతంగా రుద్దపడింది. ఆంగ్లేయుల ద్వారా మన దేశానికి దాపురించింది. నిజమైన స్పష్టమైన కాల గణన ఉన్న భారతీయ కాలమానమే ప్రపంచానికి ఆదర్శం. గ్రేగోరియన్ క్యాలెండర్ లో ఎన్నో లోపాలు కనిపిస్తాయి మనం నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని ఉగాది రోజునని… జనవరి ఒకటో తేదీ జరుపుకోవాలని నియమం ఏమీ లేదు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రేగోరియన్ క్యాలెండర్ను అనుసరిస్తాయి దీన్ని మనం క్యాలెండర్ మార్చుకొని గుర్తించాలి.