ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి:
ప్రపంచానికి పట్టిన అవినీతి క్యాన్సర్ ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తుంది. ఆ జాడ్యం ప్రపంచమంతటా పాకింది. ప్రతి ఏటా డిసెంబర్ 9న ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని 2003లో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానం చేసింది, ఈ సంవత్సరం పారదర్శకత పాలుపంచుకోండి అనే థీమ్ నినిర్ణయించారు. ప్రపంచ దేశాలలో అవినీతి తక్కువ అవినీతి గల దేశాలలో డెన్మార్క్ ఫిన్లాండ్ న్యూజిలాండ్ నార్వే సింగపూర్ పేర్కొంటారు అవినీతిలో అగ్రదేశాలుగా సిరియా, దక్షిణ సుడాన్ సోమాలియా నార్త్ కొరియా బంగ్లాదేశ్ పేర్లు చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 1995 నుండి అవినీతి దేశాల ర్యాంకులను ప్రకటిస్తుంది మన దేశం ఈ 180 దేశాల ర్యాంకుల జాబితాలో 85వ స్థానంలో ఉంది.
మన దేశంలో మొట్టమొదటి అవినీతి వ్యవహారం 1948లో వెలుగు చూసింది జీపుల కుంభకోణం ఇది పేరు కొనబడింది అప్పటి మన భారతదేశ హై కమిషనర్ గా రష్యాలో వీకే కృష్ణ మీనన్ ఉండేవారు ఆయన అన్ని ప్రోటోకాల్స్ విస్మరించి 80 లక్షల విలువ చేసే జీపుల కొనుగోలు కాంట్రాక్ట్ పై విదేశీ వ్యాపార సంస్థలతో ఒప్పందం చేసుకున్నాడు నాటి నుండి మన దేశంలో తండోపతండాలుగా అవినీతి కేసులు వెలుగు చూస్తున్నాయి.
మన చట్టాలను ఉన్న లొసుగులు అవినీతిపరులకు దీపాలల వెలుగునిస్తున్నాయి. నీకు ఆ సంస్థలు భారతదేశంలో ఎప్పుడు సుదీర్ఘ నిద్రలో జోగుతుంటాయి. పరిపాలనా విధానాల లోపాలు ఉన్నత స్థాయి అధికారుల కన్నా విచక్షణ అధికారం ఫైల్ ప్రాసెసింగ్ విధానాలు పారదర్శకత లేకపోవడం లాంటి అనేక రుగ్మతలు ఈ అవినీతి వృక్షం ఎదుగుదలకు ఎరువులు అవుతున్నాయి. ఐఏఎస్ అధికారులలో ప్రభుత్వ ఉద్యోగులలో విచ్చలవిడిగా పెరిగిపోవడం దౌర్భాగ్యం చివరకు ఈ చీర ఇప్పుడిప్పుడే న్యాయవ్యవస్థలో కూడా అడుగు పెట్టింది.
అవినీతి అన్ని రాష్ట్రాలలో నాటక పోయింది 2021లో అత్యంత అవినీతి రాష్ట్రాలుగా మహారాష్ట్ర రాజస్థాన్లను పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థ నూటికి నూరు శాతం అవినీతితో నిండిపోయింది గెలుపు పొందిన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు చివరకు ముఖ్యమంత్రిని కూడా అవినీతిలో మునిగిపోతూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. ఆ దరిద్రపు సంపదతో ఓటర్లను పోలీసు వ్యవస్థను కలుషితం చేస్తున్నారు వేలకు వేలు దోచుకుంటూ వందల కోట్లు ఎన్నికల సమయంలో ఖర్చు పెడుతున్నారు దాదాపు 50 సంవత్సరాల క్రితం ఓటర్లకు డబ్బులు ఇచ్చేవారు కాదు. మరి ఈరోజు ఎన్నికలు వస్తే ఒక్కొక్క అభ్యర్థి శాసనసభకు అయితే 100 కోట్లు పార్లమెంటు కైతే 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఓటుకు అత్యధికంగా 10000 కూడా ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికలలో పోలింగ్ ముందు రోజు ఓ పార్టీ వారు గోనె సంచులలో నోట్ల కట్టలు వేసుకొని ఓ కాలనీకి వెళ్లి ఇంటింటికి 1000 చొప్పున పెంచారు ఇలాంటి అక్రమాలకు ఏ పార్టీ అతీతం కాదు.
స్విస్ బ్యాంకులలో నల్లధనం
దేశంలో రాజకీయ నాయకులు వ్యాపారులు నల్లధనాన్ని సిస్ బ్యాంకులలో దాచుకుంటారు. షెల్ కంపెనీల ద్వారా ఈ ధనం రూటింగు జరిగేది జూలై 21, 2015- 16 ఒక వ్యక్తి సమాచార చట్టం కింద బ్యాంకులలో దాచుకున్న నల్లధనం ఎంత అని ప్రశ్నిస్తే 20,078 వేల కోట్లు అనే బోర్డ్ ఆఫ్ టాక్సెస్ సమాచారం ఇచ్చింది ఇదంతా పచ్చి అవినీతి డబ్బే అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 2019లో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసిన వ్యయం 3046 వేలకోట్లు ఇందులో బిజెపి 41% అనగా ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు వేలకోట్లు కాంగ్రెస్ పార్టీ 26% అంటే 820 కోట్లు కాగా వైసిపి 86 కోట్లు ఖర్చు చేశాయి అవినీతి కేసులలో అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులకు శిక్షలు పడ్డాయి. వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ మురాయం సింగ్ యాదవ్ శుక్రవారం జయలలిత మధుకుడే యడ్యూరప్ప చిదంబరం ఓం ప్రకాష్ చౌతాల సుబ్బు సురేన్ బంగారు లక్ష్మణ్ రాజా సురేష్ కల్మాడి పేర్లు ప్రముఖంగా చెప్పవచ్చు.
ఇక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవినీతిలో రాజకీయ నాయకులతో పోటీ పడుతూ లంచాలు తీసుకుంటున్నారు ఎంతో బాధ్యతతో విజ్ఞతతో న్యాయబద్ధంగా పాలన చేయవలసిన వీరిలో ఎక్కువమంది ప్రజలను దోచుకుంటున్నారు ఐఏఎస్ అధికారులపై 2018 19 లో 643 ఫిర్యాదులు 2019 -20 లో 753 ఫిర్యాదులు 2020-21 లో 581 ఫిర్యాదులు అన్యాయి చాలామంది పై సిబిఐ కేసులు కూడా నమోదు చేసింది ఇటీవల పూజా సింగల్ అనే మహిళ అయ్యే అధికారి వద్ద 18 కోట్ల అక్రమ సంపాదన పట్టుకోవడంతో జైలు పాలు అయ్యింది ప్రస్తుతం ఉన్న చట్టాలు ఐఏఎస్ ఐపీఎస్ లకు రక్షణ కవచాలుగా మారాయి.
కేంద్ర ఉద్యోగులకు మరక
ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగులలో కూడా అవినీతి తాండవం ఆడుతోంది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఉద్యోగులలో లక్ష 15 వేల మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి తమ శాఖ ఉద్యోగులలో 46,463 మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని సాక్షాత్తు కేంద్ర హోంశాఖనే పేర్కొంది ఇందులో దాదాపు 11,000 కేసులు రైల్వే ఉద్యోగులపై వచ్చాయి ప్రభుత్వ అధికారులు 92,100 కోట్లు అంటే జిడిపిలో 1.6 శాతం నిధులు లంచాల రూపేనా తీసుకుంటున్నారని ప్రొఫెసర్ డెబోయ్ అనే రచయిత తన భారత దేశంలో అవినీతి అన్న పుస్తకంలో వెల్లడించారు. మౌలిక సదుపాయాలలో రియల్ ఎస్టేట్ మైనింగ్ ఏరోస్పేస్ డిఫెన్స్ విద్యుత్ శాఖలను అవినీతి విలయతాండవం చేస్తుందని 2013లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ అని ప్రచార సంస్థ తన నివేదికలో పేరుకుంది.
విరాళాలు ఎన్నికల బాండ్ల రూపంలో
రాజకీయ పార్టీలకు అనామకుల నుండి లక్షల కోట్ల నల్లధనం వచ్చి పడుతుంది. వారి పేర్లు బహిర్గతపరిచే వీలు లేదు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ ది ఫార్మాస్ అనే సంస్థ 2021 22 లో ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలోని ఏడు ప్రధాన పార్టీలకు తెలియని మూలాల నుండి 2,172 వేల కోట్లు అందాయి ఈ ధరల్లో 83% అనగా 18 వేల కోట్లు కేవలం ఎలక్ట్రోలర్ బాండ్ల ద్వారా అందాయి.
మార్పు రావాలి
మనుషుల మనసులలో మార్పు రావాలి అధికారులు రాజకీయ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి దర్యాప్తు సంస్థలన్నింటికీ సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వాలి పోలీసు వ్యవస్థలో పూర్తిగా రాజకీయ నాయకుల జోక్యం తగ్గించాలి కొత్త చట్టాలు తేవాలి. పాలనలో పారదర్శకత్వం ఉండాలి. శిక్షలు కఠినంగా పడాలి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి బాల్యం నుండి విద్యార్థులకు నీతి పాఠాలు బోధించాలి. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి మునిసిపల్ పోలీసు రెవెన్యూ మైనింగ్ వైద్య ఆరోగ్య రంగాలపై నిత్యం నిగా ఉండాలి దర్యాప్తు సంస్థలన్నీ నిజాయితీ ఆఫీసర్లతో నింపాలి ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ పోలీసులు కలిసి పటిష్టనిగాతో చిత్తశుద్ధితో శేషన్ లాగా ప్రవర్తిస్తే ఓటర్లకు డబ్బు పంపకాలు తాయిలాలు ఆగిపోతాయి ఇలా అందరిలో మార్పు రావాలి అంటే ఇలాంటి అవినీతి నిరోధక దినోత్సవాలు కేవలం కంటి దులుపు కార్యక్రమాలు మాత్రమే అవినీతి రహిత భారతదేశం ఎప్పుడో
..?.

