ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అక్కినేపల్లి పురుషోత్తం రావు ఆర్గాన్ న్యూస్ రంగారెడ్డి ప్రతినిధి: తెలంగాణ పునరాక్రమణకు మళ్లీ కుట్రలు కుతంత్రాలు మొదలయ్యాయని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, దేశపతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నాడు మా ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, తెలంగాణ సాంస్కృతిక విధ్వంసం కేవలం విగ్రహాలకే పరిమితం కాలేదని తెలంగాణ ఉద్యమ గర్భంలో నుంచి పుట్టిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఆ తల్లి చేతిలో నుంచి తెలంగాణ ఆత్మ అయిన బతుకమ్మను తీసివేసి లోగో మార్చడం ద్వారా ఇక్కడి ప్రజలకు తెలంగాణ తల్లి పట్ల ఉండే అపురూపమైన అభిమానం దెబ్బతీసే ప్రయత్నం చేశారని అన్నారు. రాష్ట్రం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జరిగే “బతుకమ్మ పండుగ”లో మునపటి ఉత్సాహం ఎక్కడ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గతంలో చేపట్టిన వసతుల కల్పన, కానీ చెరువుల వద్ద ఏర్పాట్లు గాని, ఇప్పుడు కనుమరుగు అయ్యాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతున్న కొన్ని సామాజిక రాజకీయ పరిణామాలు పై పైన చూస్తే అత్యంత సాధారణంగా విడివిడిగా యాదృచ్ఛికంగా కనిపిస్తున్నప్పటికీ.. వాటిని లోతుగా విశ్లేషిస్తే ఒక ప్రమాదకరమైన ఉమ్మడి వ్యూహం అర్థం అవుతుందని నాడు రక్తం చిందించి సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణ స్పృహను క్రమంగా నిర్వీర్యం చేసి పాత ఆంధ్ర రాజకీయ సంస్కృతి ఆదిపత్యశక్తులకు మళ్లీ ఇక్కడ దారులు వేయడం అనేది ఆ అంతర్భాగ సూత్రమని అన్నారు. ఈ నిశ్శబ్ద పునరాక్రమణ ప్రయత్నానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఫెసిలిటేటర్ ( సహాయకుడు) గా వ్యవహరిస్తూ అత్యంత వ్యూహాత్మక అడుగులు వేస్తూ ఉండడం గమనార్హం అన్నారు. ఈ సందర్భంగా తాడు గుంజే ఆట గురించి దేశపతి శ్రీనివాస్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. *టగ్ ఆఫ్ వార్ ( తాడు గుంజే ఆట) మనం క్రీడల్లో టగ్ ఆఫ్ వార్ ను గమనిస్తే ఒక విషయం స్పష్టం అవుతుందని ఒకసారి తాడును ఒక పెద్ద గుంజుడు గుంజుతారని మొదట తాడును తమ వైపుకు కొద్దికొద్దిగా గుంజుతూ అవతలిపక్షం పట్టు సడలే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని అవతలి వారి తాడు పట్టు కోలిపోయి పూర్తిగా బలహీన పడ్డారు అని నిర్ధారించుకున్నాక ఒకేసారి పూర్తి శక్తితో గుంజి అవతలిపక్షాన్ని పడవేస్తారని ఇప్పుడు తెలంగాణ అస్తిత్వంతో రేవంత్ రెడ్డి సరిగ్గా అదే టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారని, తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని ఒక్కసారిగా దెబ్బకొడితే ఇక్కడ ప్రజలు సహించరని తీవ్రంగా తిరుగుబడతారని ఆశక్తులకు బాగా తెలుసునని అందుకే తెలంగాణ స్పృహను నెమ్మదిగా బలహీనపరుస్తూ పాత ఆధిపత్య శక్తుల వైపు తాడును కొద్దికొద్దిగా గొంజుతున్నారని ఇక్కడి ప్రజల పట్టు పూర్తిగా సడలగానే తెలంగాణను మళ్ళీ పాత ఉమ్మడి రాష్ట్రం రోజుల నాటి ఆదిపత్యంలోకి నెట్టివేయాలన్నది ఈ నిశ్శబ్ద కుట్ర వెనక ఉన్న అసలు రహస్యం అని అన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ఎక్కడ “జై తెలంగాణ” అని పలకకపోవడం అధికారిక కార్యక్రమాలు ప్రారంభించే ముందు అమరవీరుల స్థూపానికి దండ వేసి నివాళి అర్పించే సాంప్రదాయాన్ని ఉద్దేశాపూర్వకంగా పాటించకపోవడం రేవంత్ వైఖరిని లోతుగా పరిశీలిస్తే ఆయన అసలు ఉద్దేశం క్రమక్రమంగా తెలంగాణ స్పృహ అంతరించేలా చేయడమేనని స్పష్టమవుతుందని శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ పదం ఏ డిక్షనరీలో లేదు అనేది ఇందుకు పరాకాష్ట అసలు తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీలోనూ లేదని అదొక కృత్రిమ ఉద్వేగం అనిపించడం ఈ వ్యూహంలో పరాకాష్ట అని పేర్కొన్నారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడించడం ద్వారా ఇక్కడి ప్రజల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీకి పూర్వవైభవం తెస్తాం అంటూ ప్రత్యక్షంగా నారా లోకేష్ చేసిన ప్రకటనను కూడా మనం దీనికి కొనసాగింపుగా తీసుకోవచ్చునని అర్థం ఉంటుందని శ్రీనివాస్ అన్నారు. అందుకే మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహం హైదరాబాదులో అత్యంత కీలకమైన మైత్రివనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహ స్థాపన అనేది కేవలం ఒక దివంగత నాయకుడికి గౌరవార్థం జరుగుతున్నది, కాదని దీనిని తెలంగాణ సాంస్కృతిక స్పృహపై ఆంధ్ర రాజకీయ ఆధిపత్య శక్తులు సాధించిన ఒక “ప్రతీకారాత్మక విజయం” గా చూడవలసిన పరిస్థితి ఉందని దీనికి తోడుగా రోశయ్య, ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాలను ఆవిష్కరించడం వెనక కూడా ఒక పెద్ద అంతర్లీన వ్యూహం ఉన్నది అని తెలంగాణ సమాజానికి పాత ఉమ్మడి రాష్ట్ర జ్ఞాపకాలను మళ్లీ అలవాటు చేయడం తద్వారా అస్తిత్వ చైతన్యాన్ని క్రమంగా నీరు గార్చడమే ఇందులోని అసలు లక్ష్యం అన్నారు. అందులో కొన్ని ఉదాహరణలు ఆయన పేర్కొన్నారు. అధికారిక బహుమతులు మార్పు రాష్ట్రాన్ని సందర్శించడానికి వచ్చే దేశ, విదేశీ,అతిధులకు ప్రభుత్వ పక్షాన తెలంగాణ ప్రతీకలైన సిల్వర్ పిలిగ్రీ, కాకతీయ తోరణం లేదా చార్మినార్ కళారూపాలను జ్ఞాపికలుగా ఇచ్చే అద్భుతమైన సాంప్రదాయానికి రేవంత్ రెడ్డి త్రిలోదకాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. దానికి బదులుగా పాత ఆంధ్ర సంస్కృతి ఆధిపత్యాన్ని గుర్తుచేసే లేపాక్షినందిని ప్రభుత్వ అధికారిక జ్ఞాపికగా ఇచ్చే కొత్త పద్ధతిని అమల్లోకి తేవడం ఈ నిశ్శబ్ద లొంగుబాటుకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. భారత రాష్ట్ర సమితి గద్దెలను కూలగొట్టండి నామరూపాలు లేకుండా చేయండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం ఇస్తున్న పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కాదు అన్నారు. తెలంగాణ వాదానికి రక్షణగా నిలబడిన ప్రాంతీయ శక్తిని పూర్తిగా బలహీనపరికి తద్వారా ఏర్పడే రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని తిరిగి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పునర్ వైభవం కల్పించేందుకు దారులు సుగమం చేయడం తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మహానాడు సమావేశాలను గమనిస్తే ఈ కుట్ర ఏ స్థాయికి చేరిందో అర్థం అవుతుందని అన్నారు. స్వయంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులతోనే అదే మహానాడు వేదికగా తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయించడం అందులో భాగమే అన్నారు. అసలు తెలంగాణ అనే పదం ఏ డిక్షనరీలోనూ లేదని అదొక కృత్రిమ ఉద్వేగమని అనిపించడం ఈ వ్యూహంలో పరాకాష్టా కాదా అన్నారు . తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడించడం ద్వారా ఇక్కడి ప్రజల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని “తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం పూర్వవైభవం తెస్తాం” అంటూ నారా లోకేష్ చేసిన బహిరంగ ప్రకటనను కూడా దీనికి కొనసాగింపుగా చూడవలసి వస్తుందని ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదని తెలంగాణలో పాత ఆధిపత్య శక్తులు అధికారికంగా పునః ప్రవేశం చేయడానికి స్వాగతించినట్లు అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కేవలం రాజకీయ సాంస్కృతిక రంగాలే కాదు తెలంగాణ ప్రజల జీవనాడు లైన నీటి వనరుల విషయంలోనూ ఈ లొంగుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయంలో కానీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో కానీ తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్న రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని నిమ్మకు నీరెత్తినట్లు ఉండే ఈ వైఖరి వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న అంతర్రాష్ట్ర రాజకీయ లాబింగ్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అన్నారు. ఇటీవల హైదరాబాద్ కువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడి స్థానిక తెలంగాణ నాయకులను ప్రాంతీయ సమస్యలను పూర్తిగా పక్కకు పెట్టి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రమే కలిసి సుదీర్ఘంగా చర్చలు జరపడం ఈ యొక్క వ్యూహానికి ఉన్న జాతీయ స్థాయి రాజకీయ మద్దతును సూచిస్తుందని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో మహా పోరాటాన్ని జరిపిన మేధావులు కళాకారులు తెలంగాణ నేల నలుచెరుగులా బాజాల ప్రచారం చేసి అనేక అనేక పుస్తకాలు అచ్చు వేసి పంచి పత్రికలలో వ్యాసాలు రాసి వేలాదిమంది విద్యార్థులు యువకులు రక్తం చిందించి బలిదానాలు చేసుకొని నిర్మించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని భావజాలాన్ని అంతమొందించే ఈ నిశ్శబ్ద కుట్రను ఈ పునరాక్రమణను ప్రజలు సకాలంలో గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ విషయాన్ని ఇప్పుడే గుర్తించి తిప్పి కొట్టకపోతే భవిష్యత్తులో మన అస్తిత్వం మళ్లీ తీవ్రమైన ప్రమాదంలో పడడం తథ్యం అని దేశపతి శ్రీనివాస్ ముగించారు.