Home Adyatmikam నేటి సాయంత్రం పంచాంగ శ్రవణం

నేటి సాయంత్రం పంచాంగ శ్రవణం

16
0
  • వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షుడు సి హెచ్ వి ఆర్ కె మూర్తి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చ్ 17: వేద భూమి వ్యవస్థాపకులు కీర్తిశేషులు కొండేపూడి శ్రీనివాసరావు అడుగుజాడల్లో వనస్థలిపురం భక్త సమాజం వారు శ్రీశ్రీశ్రీ పద్మ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి సచివాలయ నగర్ కాలనీలో ఈనెల 18వ తేదీ బుధవారం సాయంత్రం బ్రహ్మశ్రీ దేవులపల్లి పవన్ కుమార్ సిద్ధాంతి చే పంచాంగ శ్రవణ కార్యక్రమం శ్రీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం సచివాలయనగర్ వనస్థలిపురంలో నిర్వహించడం జరుగుతుందని వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు సిహెచ్ వి ఆర్ కే మూర్తి తెలిపారు. మంగళవారం నాడు ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ కార్యక్రమానికి అతిధులుగా శ్రీశ్రీశ్రీ పద్మాసమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కే లక్ష్మయ్య, కార్యదర్శి పాలూరి సత్యనారాయణ సంస్కృత సంస్కృతీ ప్రవచన దౌరేయ, విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత పి టి జి వి రంగాచార్యులు, సచివాలయ నగర్ వెల్ఫేర్ అధ్యక్షులు పింగళి సాంబశివరావు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బి.యన్.రెడ్డి డివిజన్ తెలుగుదేశం పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత పాల్గొంటారని అన్నారు. హనుమంతరావు ఆధ్వర్యంలో శ్రీ స్వరమాంజలి హైదరాబాద్ వారిచే సినీ సంగీత విభావరి ఉంటుందనిఉంటుందని ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని కనుక అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం సిహెచ్ వి ఆర్ కే మూర్తి, సీనియర్ న్యాయవాది వి. సూర్యప్రకాష్ కోరారు.