Home క్రైమ్ మైనర్లు వాహనాలు నడపరాదు

మైనర్లు వాహనాలు నడపరాదు

16
0

వనపర్తి, ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి ,జనవరి 6:

మంగళవారం రోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ హరిజనవాడ హైస్కూల్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్ భద్రత వారోత్సవాలలో మరియు నేషనల్ యూత్ డే వారోత్సవాలలో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ, పారా లీగల్ వాలంటరీ బంకల రవీందర్,శివ ప్రసాద్ మాట్లాడుతూ మెయినర్లకు వాహనాలు ఇచ్చిన వాహన యజమానుల పై కేసులు నమోదు అవుతాయి అని తెలియజేశారు. బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం మైనర్ల వివాహాలకు సహకరించిన ప్రతి ఒక్కరు శిక్ష అర్హులు అవుతారని తెలిపారు. విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాము అని 18 సంవత్సరాలు దాటిన తరవాత వాహనాలు నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు గాంధీనగర్ హై స్కూల్ విద్యార్థులకు మరియు సిబ్బంది కి మోటార్ వెహికల్ యాక్ట్ మరియు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా హరిజనవాడ హై స్కూల్ నుండి జమ్మి చెట్టు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, పారాలిగల్ వాలంటరి బంకల రవీందర్, శివప్రసాద్ ట్రాఫిక్ ఎస్సై సురేందర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.