Home Uncategorized కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య జయంతి

కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య జయంతి

19
0

కొత్తగూడెం ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 3:

దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి / కన్వీనర్ పి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరము దొడ్డి కొమరయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమమునకు జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన దొడ్డి కొమరయ్య చిత్రపటమునకు పూల మాలను వేసి జిల్లా అదనపు కలెక్టర్ వి వేణుగోపాల్, మైనారీటీ సంక్షేమ శాఖ సంజీవరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించారు. తదుపరి దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర భావితరాలవారికి ఆదర్శనీయం అని ఆయన చేసి నటువంటి పోరాటం, చూపించిన చొరువ నేటితరం వారు ఆచరించాలని తెలియజేసినారు. కార్యాక్రమములోదూడల బుచ్చయ్య , సుంక పెద్దాపురం, కంచెర్ల లింగయ్య ,బైరి రవి కుమార్, కె. సాయి కుమార్ , దూడల కిరణ్ ,జిల్లా అధికారులు, వసతిగృహ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి పలువురు బి.సి. నాయకులు ప్రసంగించారు.