Home తెలంగాణ ఉపాధి హామీలో ముఖ గుర్తింపు హాజరు విధానం రద్దు చేయాలి

ఉపాధి హామీలో ముఖ గుర్తింపు హాజరు విధానం రద్దు చేయాలి

23
0
  • రాయికంటి శ్రీనివాస్ మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 16:

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ముఖ గుర్తింపు (ఫేస్ ఆధారిత) ఫోటోతో హాజరు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, వి బి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా ఉపాధి హామీ మేట్ల వ్యవస్థను పునరుద్ధరించాలని, సమ్మర్ అలవెన్స్‌ను కొనసాగించాలని తెలిపారు. కూలీలందరికీ అవసరమైన పనిముట్లు అందించాలని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న కార్మికులకు వెంటనే జాబ్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పని ప్రదేశాల్లో కార్మికులకు తాగునీటి సౌకర్యం, టెంట్, మెడికల్ కిట్ వంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజువారీ కూలిని రూ.600 గా నిర్ణయించి, సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు