Home agriculture యాప్ ద్వారానే యూరియా విక్రయించాలి

యాప్ ద్వారానే యూరియా విక్రయించాలి

15
0
  • ఏ డి ఏ సతీష్

తిరుమలాయపాలెం, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 5:

కూసుమంచి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు మిట్టపల్లి సతీష్ గురువారం మండలంలో పర్యటించారు. పిండి ప్రోలు, దమ్మాయిగూడెం, జూపెడ, సుబ్లేడ్ గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లు యూరియా బుకింగ్ యాప్ లను పరిశీలించారు. యూరియాను యాప్ ద్వారా మాత్రమే విక్రయించాలని డీలర్లను ఆదేశించారు. ఆ తర్వాత హస్నాబాద్ గ్రామంలో వరి పంట పొలాలను పరిశీలించారు. జింక్ లోపం ఉన్నట్లు గుర్తించినారు దీని నివారణకు గాను చలామీన్ జింక్ ఎకరాకు 100 గ్రాములు వారంలో రెండుసార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు అన్నారు. అదేవిధంగా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి యూరియా బుకింగ్ యాప్ ఫార్మర్ రిజిస్ట్రీ క్రాబ్ బుకింగ్ పై రైతులకు అవగాహన కల్పించినారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారామ్ రెడ్డి ఏఈఓ బాలకృష్ణ రైతులు పాల్గొన్నారు.