Home తెలంగాణ మహిళలు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

మహిళలు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

54
0

వి.రజని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్

వనపర్తి ,ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి , మార్చ్ 6

అంతర్జాతీయ మహిళల దినోత్సవం వారోత్సవాలలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రేవెల్లి మండలం, కేశంపేట గ్రామం, పాతతాండ గ్రామపంచాయతీకి చెందిన గిరిజన మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహిళల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ వారి జీవిత లక్ష్యాలను సాధించాలని కోరారు. ప్రతి మహిళ మహిళా హక్కులు మరియు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని పొందాలని సూచించారు. అదేవిధంగా గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, గర్భాధారణకు ముందు మరియు ప్రసవానికి ముందు లింగ నిర్ధారణను నిరోధించే చట్టం మరియు పోష్ ఆక్ట్ గురించి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి సబ్ ఇన్స్పెక్టర్ రజిత మరియు పారా లీగల్ వాలంటీర్ బంకల రవీందర్ పాల్గొన్నారు.