Home POLITICS మక్తల్ మున్సిపాలిటీ వార్డు సభ్యుడిగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య!

మక్తల్ మున్సిపాలిటీ వార్డు సభ్యుడిగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య!

25
0

ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 10:నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య

అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మహదేవప్ప ఆత్మహత్య, కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరి 11న పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9, సోమవారంతో ప్రచారం ముగిసింది. అయితే చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవ్.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్‌పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.

రేపు బుధవారం ఎలక్షన్‌ ఉండడంతో కొందరు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.

ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్‌ చేసుకున్నారా.. వేరే కారణం ఉందా అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.!