Home ఖమ్మం ఎన్నికల నేపథ్యంలోమద్యం దుకాణాలు బంద్

ఎన్నికల నేపథ్యంలోమద్యం దుకాణాలు బంద్

28
0
  • 9 సాయంత్రం నుండి 11 సాయంత్రం వరకు
  • పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం ఆర్గాన్ న్యూస్ :

ఫిబ్రవరి11 తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మున్సిపాలిటీ ప్రాంతాలలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 9 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి ఫిబ్రవరి 11 న ఎన్నికలు ముగిసే వరకు మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు. అదేవిదంగా ఫిబ్రవరి 13 న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉదయం 8:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు ఖమ్మం జిల్లా పరిధిలోని ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మునిసిపాలిటీ కౌంటింగ్ సెంటర్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలలో భాగంగా మూసివేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు.