Home తెలంగాణ మాకు కూడా ఉచిత నీటి సరఫరా చెయ్యండి

మాకు కూడా ఉచిత నీటి సరఫరా చెయ్యండి

17
0
  • మీర్ పేట బడంగ్ పేట కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,జనవరి 12: శంషాబాద్ జోన్ బడంగ్ పేట సర్కిల్ మీర్ పేట కార్పొరేషన్లలో 57, 58, 59, 60, 61, 62, డివిజన్లో ఉచిత నీటి సరఫరా చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎండికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని మీర్పేట బడంగ్ పేట సర్కిల్స్ భారతీయ జనతా పార్టీ పసునూరి బిక్షపతి చారి తెలిపారు. 57వ డివిజన్ ఆధ్వర్యంలో 58 ప్రశాంతి హిల్స్ 59 జిల్లెల్ల గూడ, 60 మీర్ పేట 61 బడంగ్ పేట 62 బాలాపూర్ డివిజన్లు విలీనం చేసిన సందర్భంగా ఇంతకుముందు ఉన్న జిహెచ్ఎంసి వార్డుల పరిధిలో నివాసితులకు నెలకు 20,000 లీటర్ల వరకు నీటి బిల్లుల మినహాయింపు ఇస్తున్నట్లుగా పైన పేర్కొన్న మా డివిజన్లో కూడా వర్తింపజేయాలని పాత నీటి బిల్లులు కూడా మాఫీ చేయాలని వినతి పత్రంలో కోరారు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి తక్కువ ఆదాయ వర్గ కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వ విధానాల సమాన అమలు దృష్టిలో ఉంచుకొని మా వినతిని అనుకూలంగా త్వరితగతిన పరిశీలిస్తారని ఆశిస్తున్నామని అందులో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మీర్పేట బడంగ్ పేట కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి తులసి ముఖేష్ ముదిరాజ్ రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శులు దాసాని తిరుపతిరెడ్డి ఇందిరావత్ రవి నాయక్ సిద్దాల శ్రీనివాస్ మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కోడూరు సోమేశ్వర్ మాజీ ప్రజాప్రతినిధులు ఏ భీమరాజు రాష్ట్ర నాయకులు నిఖిల్ సింగ్ మల్లేష్ యాదవ్ భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.