Home POLITICS నేడు ముంజంపల్లికి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్

నేడు ముంజంపల్లికి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్

22
0

మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 27:

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కరీంనగర్ జిల్లాకు రానున్నారు.
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం, నిధుల్లో కోత విధించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో ఉపాధి కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు.