Home తెలంగాణ తెరుచుకున్న చికెన్ షాపులు

తెరుచుకున్న చికెన్ షాపులు

20
0

రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 2:

గత 24 గంటల క్రితం మూతపడ్డ చికెన్ షాపులు గురువారం ఉదయం మళ్లీ తెరుచుకున్నాయి. దీనితో సగటు నాన్ వెజ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అనేక చికెన్ షాపులు తెరుచుకున్నాయి, నూటికి నూరు శాతం చికెన్ షాపులు తెరుచుకోవడంతో వ్యాపారం యధావిధిగా కొనసాగింది. చికెన్ కంపెనీలు తమకు మార్జిన్ పెంచుదామని హామీ ఇవ్వడంతో చికెన్ షాపులు తెరుచుకున్నాయని అల్మాస్గూడ కు చెందిన చికెన్ షాప్ యజమాని ఉపేందర్ తెలిపారు. ఈరోజు రాత్రి కంపెనీలన్నీ ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత షాపుల వారికి ఎంత మార్జిన్ అందిస్తారో తెలియజేస్తామని చెప్పడంతో చికెన్ షాపులు యధావిధిగా పనిచేస్తున్నాయి. ఇలాగే చికెన్ షాపులు కొద్ది రోజులు తెరుచుకుంటే కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ నష్టాన్ని భరించలేక మార్జిన్ పెంచేందుకు అంగీకరించాయని మార్జిన్ ఎంత అనేది మరో 24 గంటల్లో తెలుస్తుందని ఉపేందర్ తెలిపారు.