Home Uncategorized ఈరోజు కుటుంబానిది…

ఈరోజు కుటుంబానిది…

10
0

నేడు మే 15వ తేదీ.. ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా అక్కినేపల్లి పురుషోత్తమరావు ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి అందజేస్తున్న ప్రత్యేక కథనం

కుటుంబ సమూహమే గ్రామమైన రాష్ట్రమైనా దేశమైనా ఆర్థిక సంస్కృతిక విషయాలలో ఏ దేశానికి అయినా పునాది కుటుంబమే. కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది. అందుకే ప్రపంచ దేశాల మంచి చెడ్డలకు ఒకాల్తా పుచ్చుకునే ఐక్యరాజ్యసమితి కుటుంబ సంక్షేమం కోసం ఒక రోజును ” ప్రపంచ కుటుంబ దినోత్సవం గా ” ప్రకటించింది. ఆరోజు మే 15 అంటే ఈ రోజే.
1993 వ సంవత్సరంలో ప్రారంభమైన కుటుంబ దినోత్సవం వేడుకను ఏటా వివిధ దేశాలకు తమదైన శైలిలో నిర్వహించుకుంటున్నాయి. తమ దేశ పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ పరమైన ఏదో అంశాన్ని ఎంచుకొని ప్రజలను చైతన్యపరిచేందుకు వర్క్ షాప్ లు సంస్కృతిక కార్యక్రమాలు ప్రచారం మాధ్యమాలలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆరోగ్యవంతమైన పౌరులే దేశానికి నాణ్యమైన మానవ వనరులు. ఏ రంగం అభివృద్ధికి అయినా మూలం వారే. అందుకే ఆరోగ్యం అనేది సుస్థిర భవిష్యత్తు సాధనలో కీలకం అయ్యింది. కుటుంబ స్థాయిలో తీసుకునే చర్యలే వ్యక్తుల ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి కాబట్టి సమస్యను అక్కడి నుంచి సరిదిద్దాలని ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిల్లలకు టీకాల సమయానికి ఇప్పించడం పోషకాహారం వడ్డి పెట్టడం పరిసరాల పరిశుభ్రత వివిధ రకాల సంక్రమిక వ్యాధుల నివారణ ఆ దిశగా అవగాహన స్త్రీల ఆరోగ్యం తదితర విషయాలపై ప్రపంచం ఈరోజు దృష్టి సారించింది

వేగంగా మారుతున్న భారత కుటుంబ ముఖ చిత్రం

చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం అని భారత ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారం పుణ్యమా అని భారత కుటుంబ వ్యవస్థ స్వరూపం వేగంగా మారుతుంది అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఆర్థిక రాజకీయ సంస్కృతిక రంగాలలో ఉప్పెన లాంటి మార్పులను చవిచూసిన దశకమైన ఈ మార్పు కూడా వేదికైంది.
1991 జనాభా లెక్కలు వ్యక్తుల కన్నా కుటుంబాల సంఖ్యలో ఎక్కువ పెరుగుదల రేటు తొలిసారిగా నమోదు అయ్యింది. అది 2001 2011 లెక్కల్లో కూడా పునరావృతం అయ్యింది ఉమ్మడి కుటుంబాలు తల్లిదండ్రులతో కలిసి ఉండే కుటుంబాలు పోయి క్రమంగా వైయక్తిక కుటుంబ వ్యవస్థే ఈనాటి భారత కుటుంబం ముఖచిత్రంగా మారింది.
కుటుంబ సభ్యుల సంఖ్యలో పెరుగుదలతో పాటు కుటుంబ యజమాని సగటు వయస్సు అతి తక్కువగా నమోదు అవ్వడం మరో విశేషం. ఇవే కాదు ఈ మార్పు కుటుంబంలోని పెత్తనం విషయంలోనూ సాంప్రదాయక పురుష ఆదిపత్యంలోనూ స్త్రీ యజమాన్య పెరుగుదలలోను కనిపిస్తుంది. స్త్రీ పురుష సమానత దృశ్య కొన్ని పరిణామాలు ఆహ్వానించదగ్గవే అయిన కుటుంబాలు విపరీతంగా కుషించకపోవడం విచ్ఛిన్నమవడం మాత్రం మన మానసిక శారీరక ఆరోగ్యాలను పరిరక్షించుకునే కోణంలో కూడా చర్యలు ఉండాలి అంటున్నారు నిపుణులు.