Home ఎడిటోరయిల్‌, ఆర్గాన్ న్యూస్ వడదెబ్బను తేలికగా తీసుకోవద్దుప్రతిక్షణం కీలకంనిర్లక్ష్యంతో ప్రాణాలకే ముప్పు.ఏఐజి బీట్ హిట్ అవగాహన సదస్సు

వడదెబ్బను తేలికగా తీసుకోవద్దుప్రతిక్షణం కీలకంనిర్లక్ష్యంతో ప్రాణాలకే ముప్పు.ఏఐజి బీట్ హిట్ అవగాహన సదస్సు

7
0

అక్కినే పల్లి పురుషోత్తమరావు ఆర్గాన్ న్యూస్ మే 12.

చాలామంది హీట్ స్ట్రోక్ ( వడదెబ్బను) సాధారణ నీరసం డిహైడ్రేషన్ అనుకుంటారు. కానీ ఇది మెదడు గుండె కిడ్నీలపై వేగంగా ప్రభావం చూపించే అత్యవసర పరిస్థితి. ఈ నేపథ్యంలో సంకేతాలను ముందే గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించాలి లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలకు వడదెబ్బ హీట్ స్ట్రోక్ పై అవగాహన కల్పించేందుకు ఏది ఆసుపత్రి బీట్ ది హీట్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వైద్యులు అనేక సూచనలు చేశారు.

చెమట పట్టకపోవడం ప్రమాద కరసంకేతం

జ్వరం వచ్చినప్పుడే శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పనిచేస్తుంది చెమట పట్టి శరీరం వెంటనే చల్లబడుతుంది హీట్ స్ట్రోక్ లో ఆ వ్యవస్థ పూర్తిగా విఫలం అవుతుంది ఎండలో ఉన్న సరే చెమట పట్టదు. ఇది అత్యంత ప్రమాదకర సంకేతం. తొలత అలసట తల తిరగడం వికారం ఉంటుంది తర్వాత గందరగోళం మాట చదవడం ఫిట్స్ లక్షణాలు కనిపిస్తాయి నిర్లక్ష్యం చేయకుండా రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించి వేడి వాతావరణం లో ఉన్నప్పుడు జాతిలో అసౌకర్యం ఆయాసం స్పృహ కోల్పోవడం తీవ్ర అలసట లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

శరీరాన్ని కూలింగ్ చేయడమే కీలక ప్రక్రియ

హీట్ స్ట్రోక్ తో తొలి 5 నిమిషాలు చాలా కీలకం అంబులెన్స్ కోసం ఎదురు చూడకుండా బాధితుడుని నీడకు తరలించి గాలి తగిలేలా చెయ్యాలి తడి వస్త్రంతో శరీరాన్ని తెలవాలి మెడ సంకలు గజ్జలలో ఐస్ ప్యాక్ పెట్టాలి. షీట్ స్ట్రోక్ లో శరీరాన్ని కూలింగ్ చేయడమే వైద్యంలో కీలక ప్రక్రియ విపరీతమైన వేడి వల్ల గుండెపై భారం పెరుగుతుంది శరీరాన్ని చల్లబరచడానికి గుండె ఎక్కువ రక్తాన్ని పంపు చేయవలసి వస్తుంది. మరోవైపు డిహైడ్రేషన్ వల్ల శరీరంలో రక్త పరిమాణం మరింత తగ్గి అది కూడా గుండెకు ఒత్తిడి పెంచతుంది వృద్ధులు చిన్నారులు గర్భిణీలు ఎండలో పనిచేసేవారు వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి వైద్యులను సంప్రదించాలని మందులు మానివేయరాదని వైద్యులు తెలిపారు.

తప్పక పాటించవలసిన సూత్రాలు

నిరంతరాయంగా నీళ్లు తాగుతూ ఉండాలి దాహం వేసే వరకు ఉండకుండా రోజుకు 7 8 గ్లాసుల నీళ్లు తాగాలి కొబ్బరినీళ్లు మజ్జిగ నిమ్మరసం లాంటివి కూడా తీసుకోవచ్చు ఎండలో వెళ్లకపోవడమే మంచిది ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలో వెళ్లకపోవడమే మంచిది లేత రంగు దుస్తులు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని వైద్యులు పేర్కొంటున్నారు. అవి శరీరాన్ని చల్లబరుస్తాయి ఆల్కహాల్ వద్దు ఆల్కహాల్ శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి మద్యంతో పాటు కెఫిన్ ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి. పార్క్ చేసిన వాహనాలలో ఇంటి వద్ద పార్కు చేసిన కార్లలో పిల్లలను పెంపుడు జంతువులను వదిలివేయరాదని అందులో వేడితో వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.