Home క్రైమ్ లైంగిక దాడి నిందితుడుగౌస్ అరెస్ట్

లైంగిక దాడి నిందితుడుగౌస్ అరెస్ట్

36
0
  • ఫోక్సో కేసు నమోదు – రిమాండ్ కు కోర్టు ఆదేశం
  • భాదితుల వివరాలు వెల్లడిస్తే పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు
  • మీడియా కు సోషల్ వార్నింగ్ ఇచ్చిన ఏసీపీ

ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, జూన్ 9:

ఖమ్మం నగరంలో ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసి బిల్డింగ్ పై నుండి కిందకు తోసిన ఘటనలో కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఖమ్మం 2 వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ఇవ్వగా హత్యయత్నం, పొక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభింఛి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి వైద్య పరీక్షలు చేయించారు. సేకరించిన ఆధారాల ప్రకారంగా ఈ కేసులోని నిందితుడు ఎండీ గౌస్, 57 సం.లు, కార్ డ్రైవర్, నివాసం రాపర్తి నగర్, జి .ప్రైడ్ అపార్ట్ మెంట్, ఖమ్మం అను అతన్ని కేసు నమోదు అయిన 24 గంటల లోపు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్ట్ లో హాజరు పరిచారు. కేసు విచారణ లో ఉన్నందున మిగిలిన వివరాలు పూర్తి దర్యాప్తు అనంతరం తెలియపర్చగలమని కేసు లో బాధితురాలు బాలిక ఫోటో లను గాని పేరు వివరాలను గాని బహిర్గత పరుస్తూ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తే, పొక్సో యాక్ట్ & బి ఎన్ ఎస్ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదు చేస్తామని ఖమ్మం ఏసీపీ రమణ మూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.