- వివిధ కార్యక్రమాలతో గ్రామ ప్రజల ప్రశంసలు
- హర్షం వ్యక్తం చేస్తున్న వ్యవసాయ కళాశాల అసోసియేషన్ డీన్ డాక్టర్ జె హేమంత్ కుమార్
అశ్వారావుపేట, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 27:
అశ్వారావుపేట మండలం పరిధిలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులు మల్లాయిగూడెం గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదటగా వారు రైతుల పొలాల్లో మట్టి నమూనాలను సేకరించారు అలాగే భూసార పరీక్షా నమూనా నీ సేకరించే విధానం మరియు భూసార పరీక్ష కార్డుల గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం జమీమా మనం తినే ఆహారంలో మరియు పండించే పంటలో మరియు నేలలో ఉండే అవశేషాలను గురించి వివరించారు .వివిధ వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్లో వచ్చే తెగుళ్లు చీడపీడల యాజమాన్యాన్ని గురించి రైతులతో చర్చించారు. తదుపరి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నాటు కోడి గుడ్డు ఇంకుబేటర్ సెంటర్ ను సందర్శించడం జరిగింది. అక్కడ వారు వివిధ సందేహాలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో స్వచ్ఛ మల్లాయిగూడెం లో భాగంగా విద్యార్థులు గ్రామంలోని వివిధ వీధుల్లోకి వెళ్లి పరిసరాలని శుభ్రం చేయడం అలాగే కలుపు మొక్కలను నిర్మూలించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. జె.హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి. స్రవంతి, డా.ఝాన్సీ రాణి మరియు డా. శ్రీజన్ లు నిర్వహించారు.


