Home తెలంగాణ భానుడి భగభగలకు రైతు బలి

భానుడి భగభగలకు రైతు బలి

22
0

మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మే 22:

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆరెల్లి పరశురాములు (62) వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు.
రెండు రోజుల క్రితం వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లిన పరశురాములు తీవ్ర ఎండల ప్రభావంతో అస్వస్థతకు గురయ్యారు. ఇంటికి వచ్చిన అనంతరం ఆరోగ్యం మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
జిల్లాలో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
పరశురాములు మృతితో పోరండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు.