ఆర్గాన్ |ఖమ్మం:
భవిష్యత్తులో ఎదురైయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకాంక్షించారు. *నూతన సంవత్సర వేడుకలను సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరపున పోలీస్ సిబ్బందికి, హోంగార్డ్, ప్రజలందరికీ CP సునీల్ దత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీస్ యంత్రాంగం చేసిన సమిష్టి కృషి ఫలితమే నేడు సంతోషకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకుంటానమని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం జిల్లా పోలీసు యంత్రాంగం ఇదే స్పూర్తితో ముందుకు సాగలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాద్ రావు అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం, ఏసీపీలు, అర్ఐలు, సిఐలు, ఎస్సైలు, పోలీస్ కమిషనర్ కార్యాలయ మినిస్ట్రీయల్ స్టాఫ్, పాల్గొన్నారు.


