Home తెలంగాణ తమ్మినేనిని పరమర్శించిన జాన్ వెస్లీ

తమ్మినేనిని పరమర్శించిన జాన్ వెస్లీ

16
0
  • అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కామ్రేడ్ తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, నాయకులు

హైదరాబాద్, మార్చి 14,ఆర్గాన్ న్యూస్:

సిపిఎం సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్యసంస్థ ఏఐజి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సిపిఎం రాష్ట్ర నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆసుపత్రికి వెళ్లి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో , ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా తమ్మినేని సేవలను ఆయన గుర్తుచేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో పార్టీ నాయకులు అబ్బాస్, బి. వెంకట్, సాగర్, భూపాల్, వెంకట్రాములు, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వారు తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు.
పార్టీ శ్రేణులు, అభిమానులు తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నారు.