Home Uncategorized జాతరలో మున్సిపల్,హెల్త్ వర్కర్ల సేవలు చాలా గొప్పవి

జాతరలో మున్సిపల్,హెల్త్ వర్కర్ల సేవలు చాలా గొప్పవి

25
0
  • 5000 వేల మంది పారిశుధ్య కార్మికులు 24 గంటలు అందుబాటులో
  • అధికారులు జాతరలో సేవ చేయటం ఎంతో ఆనందం సంతోషం వ్యక్తం చేశారు

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, జనవరి 31:

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర
ములుగు జిల్లా మేడారం జాతరలో పంచాయితీ రాజ్ మున్సిపల్ సానిటేషన్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి
మేడారం మహా జాతరలో మున్సిపల్ పంచాయతీరాజ్ హెల్త్ వర్కర్స్ అధికారి నుండి కిందిస్థాయి పారిశుధ్య కార్మికుల వరకు సుమారు 5 వేల మంది నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటూ రోడ్లు మరుగుదొడ్లు పారిశుద్ధ్యం నిర్వహణ చేస్తూ సేవలు అందిస్తున్నారు.జాతరకు నెల రోజుల ముందు నుండి పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జాతర అనంతరం కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతాయని సంబంధిత అధికారులు చెప్పారు.తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ నుండి ఈ హెల్త్ సానిటేషన్ వర్కర్లను తీసుకోవడం జరిగింది. డిపిఓ డివిజనల్ పిఓలు ఎంపీడీవోలు ఎంపీవోలు పంచాయతీ సెక్రటరీలు తదితరులు నిత్యం అమ్మవారి గద్దెల ప్రాంగణం ఇతర కార్యాలయాలు అధికారుల నివాస ప్రాంతాలు రహదారుల వెంబడి మరుగుదొడ్ల పరిశుభ్రత క్లీనింగ్ బ్లీచింగ్ తదితర ప్రదేశాలలో అంకిత భావంతో సానిటేషన్ పనులు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్త్ సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.సేకరించిన చెత్త వేస్టేజ్ ని ప్రత్యేక ట్రాక్టర్లు ట్రాలీ ఆటోలు తదితర వాహనల ద్వారా సెక్రిగేషన్ చేసి తరలించడం జరుగుతుంది.
అధికారులు జాతరలో సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.జాతర నిర్వహణలో గ్రామీణ మంచినీటి సరఫరా త్రాగునీరు అందించడం హెల్త్ శానిటేషన్ పనులు వైద్య ఆరోగ్యశాఖ విద్యుత్ తదితర మహా జాతరలో సెక్టార్ విభాగాల వారీగా సేవలు విధులు నిర్వహిస్తున్నారు.